కూలిన వంతెన

ABN , First Publish Date - 2022-09-11T05:12:13+05:30 IST

అయిజ మండలంలోని యాపదిన్నె గ్రామ సమీపంలో ఉన్న వంతెన కూలింది.

కూలిన వంతెన
కూలిన వావిలాల - యాపదిన్నె వంతెన

- రహదారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటుచేసిన పోలీసులు


అయిజ/ఇటిక్యాల, సెప్టెంబరు 10: అయిజ మండలంలోని యాపదిన్నె గ్రామ సమీపంలో ఉన్న వంతెన కూలింది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వంతెన పూర్తి స్థాయిలో దెబ్బతింది. అంతకుముందే వంతెన శిథిలావస్థకు చేరింది. వంతెన కింది భాగంలోని పునాది గోడలు కూలాయి. విషయాన్ని శనివారం సాయంత్రం గమనించిన అయిజ ఎస్సై నరేష్‌, పోలీసు సిబ్బంది, యాపదిన్నె గ్రామస్థుల సహకారంతో రోడ్డుకు అడ్డంగా కర్రలతో బారి కేడ్లు ఏర్పాటు చేశారు. వంతెన మీదుగా రాకపోకలను నిషేధించారు. అయిజ మండలం వెంకటాపూర్‌ మీదుగా యాపదిన్నె, వావిలాల, సాతర్ల, మీదుగా ఉదండాపూర్‌ వరకు రహదారి చేరుకుంటుంది. అక్కడ నుంచి మూడు భాగా లుగా విడిపోతుంది. ఇటిక్యాల మీదుగా జింకల్‌పల్లి చేరుకోవచ్చు. షాబాద మీ దుగా వేముల నుంచి 44 హైవే చేరుకుంటుంది. రేకులపల్లి మీదుగా గద్వాల చేరుకుంటుంది. వంతెన కూలిపోవటంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. వంతెన కూలిపోవడంతో పరిసర గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంత రాయం ఏర్పడినట్లు ఇటిక్యాల ఎంపీటీసీ సభ్యురాలు లత తెలిపారు. ద్విచక్ర వాహ నాలు తప్పా మిగతా వాహనాలు వెళ్లడానికి ఇబ్బందికరమని, ప్రమాదాలు చోటు చేసుకొనే అవకాశముందని, వాహనదారులు గుర్తించాలని ఆమె సూచించారు. 

Updated Date - 2022-09-11T05:12:13+05:30 IST