మాంటిస్సోరిలో ఘనంగా బాలల దినోత్సవం

ABN , First Publish Date - 2022-11-15T23:40:08+05:30 IST

అలంపూర్‌ మండల కేంద్రంలోని మాంటిస్సోరి పాఠశాలలో బాలల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.

మాంటిస్సోరిలో ఘనంగా బాలల దినోత్సవం
శాస్ర్తీయ నృత్యాన్ని ప్రదర్శిస్తున్న విద్యార్థులు

అలంపూర్‌ చౌరస్తా, నవంబరు 15 : అలంపూర్‌ మండల కేంద్రంలోని మాంటిస్సోరి పాఠశాలలో బాలల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, యోగా విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆనంతరం విద్యార్థులు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఇదే రోజు మాంటిస్సోరి పాఠశాలల వ్యవస్థాపకురాలు కల్యాణమ్మ జయంతి ఉత్సవాలు కూడా నిర్వహించారు. ముందుగా పాఠశాల డైరెక్టర్‌ రవిప్రకాష్‌, మేనేజర్‌ గురురెడ్డి, సూపర్‌వైజర్లు ప్రమీల, జ్యోతి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు.

Updated Date - 2022-11-15T23:40:10+05:30 IST