చికిత్స పొందుతూ చిన్నారి మృతి

ABN , First Publish Date - 2022-09-18T04:46:13+05:30 IST

గంజి పడి చికిత్స పొం దుతూ చిన్నారి మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

చికిత్స పొందుతూ చిన్నారి మృతి
తేజస్విని

పెంట్లవెల్లి, సెప్టెంబరు 17: గంజి పడి చికిత్స పొం దుతూ చిన్నారి మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై రమేశ్‌ కథనం ప్రకారం.. పెంట్లవెల్లికి చెందిన తూడుకుర్తి రాజు భార్య రజిత ఈనెల 10వ తేదీన ఉదయం ఇంట్లో అన్నం వండుతుండగా ప్రమాదవశాత్తు వేడి గంజి కుమార్తె తేజస్విని(2) ఒంటిపై పడింది. చిన్నారిని చికిత్స నిమిత్తం కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు నాగర్‌కర్నూల్‌, అక్కడ్నుంచి మహబూబ్‌నగర్‌, ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమి త్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్ర వారం రాత్రి చిన్నారి మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. 

Read more