కారణజన్ముడు సంత్‌ సేవాలాల్‌

ABN , First Publish Date - 2022-02-23T05:36:19+05:30 IST

బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ కారణజమ్ముడని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు

కారణజన్ముడు సంత్‌ సేవాలాల్‌
సేవాలాల్‌ చిత్ర పటానికి పూజలు చేస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

- ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

- జిల్లా కేంద్రంలో ఘనంగా సేవాల్‌ జయంతి ఉత్సవాలు

- బంజారా గిరిజనుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ 

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఫిబ్రవరి 22: బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ కారణజమ్ముడని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సంత్‌ సేవాలాల్‌  జయంతి వే డుకలను బంజారా గిరిజనులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హౌసింగ్‌బోర్డుకాలనీ నుంచి బస్టాండ్‌ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వ హించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా బంజారా మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేసి ఉత్సాహపరిచారు. అనంతరం సాయి గార్డెన్‌లో నిర్వహించిన మహాబోగ్‌ కార్యక్రమంలో అగ్ని దేవతలకు ఎమ్మెల్యే పూజలో పాల్గొని సంత్‌సే వా లాల్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నమస్కరించారు.  కార్యక్ర మం లో డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొ రేష న్‌ చైర్మన్‌ సాయిచంద్‌, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌  మాదవరం హనుమంతరావు, మునిసి పల్‌ చైర్‌పర్సన్‌ కల్పన, వైస్‌ చైర్మన్‌ బాబు రావు,  గిరిజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

& తిమ్మాజిపేట :  మండల కేంద్రంలో మంగళవారం సంతు సేవా లాల్‌ మహారాజ్‌   జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా సేవాలాల్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనం తరం పలు గ్రామాల నుంచి గిరిజనులు బైక్‌ ర్యాలీగా జిల్లా కేంద్రానికి వెళ్లారు. కార్యక్రమంలో  సర్పంచుల సంఘం అధ్యక్షులు వేణుగోపాల్‌గౌడ్‌,  సర్పంచులు హుని రవి, హర్యానాయక్‌, ఎంపీటీసీ సభ్యురాలు లీలావతి,   వ్యవసాయ మార్కెట్‌  కమిటీ డైరెక్టర్‌ హుస్సేని, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్‌, నాయకులు తారా సింగ్‌, చందునాయక్‌, రవి, కృష్ణ, రమేష్‌ పాల్గొన్నారు. Read more