విరిగిపడ్డ కొండచరియలు

ABN , First Publish Date - 2022-09-30T04:47:54+05:30 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉమా మహే శ్వర క్షే త్రంలో ఒక్కసారిగా కొండ చరియలు విరిగి పడుతుండడంతో భక్తులు ఆందోళనలకు గురవుతున్నారు.

విరిగిపడ్డ కొండచరియలు
ఉమామహేశ్వరంలో విరిగిపడ్డ కొండచరియలు

అచ్చంపేట, సెప్టెంబరు 29: నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉమా మహే శ్వర క్షే త్రంలో ఒక్కసారిగా కొండ చరియలు విరిగి పడుతుండడంతో భక్తులు  ఆందోళనలకు గురవుతున్నారు. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తో ఉమామహేశ్వర ఆలయ సమీపంలోని దారుల వెంట నీటి ప్రవాహం ఉధృ తంగా ప్రవహిస్తోంది. దీంతో ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దేవాల య సమీపంలో భక్తులు అటువైపుగా లేకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్ప వచ్చు. ఎప్పుడు ఎక్కడి నుంచి కొండ చరియలు విరిగిపడుతాయోనన్న ఆందోళన భక్తుల్లో నెలకొంది. 


Read more