ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీదే అధికారం

ABN , First Publish Date - 2022-11-27T22:39:31+05:30 IST

ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణలో బీజేపీదే అధికారమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి అన్నారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీదే అధికారం
బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి

- బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, నవంబరు 27: ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణలో బీజేపీదే అధికారమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని హిమాలయ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమా వేశానికి ఆమెతో పాటు, జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి హాజరై, జిల్లా కార్గవర్గా నికి పార్టీ ప్రజా ఉద్యమాలపై దిశా నిర్దేశం చేశా రు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ రా ష్ట్రంలో పరిపాలన గాలికొదిలేసిన సీఎం కేసీఆర్‌ కు బీజేపీ భయం పట్టుకుందన్నారు. ప్రజల వి శ్వాసం కోల్పోయిన కేసీఆర్‌ ఎమ్మెల్యే కొనుగోలు డ్రామాలకు తెర తీసి ప్రజలను నమ్మించే ప్రయ త్నం చేస్తున్నారని ఆరోపించారు. ఫాంహౌస్‌ నాట కంలో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నటించి ప్రజల చీత్కారానికి గురయ్యారని విమర్శించారు. జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు టి.ఆచారి మా ట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ ప థకాలకు, ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని సీఎం కేసీ ఆర్‌ ప్రభుత్వ భూముల్ని అమ్ముతూ తెలంగాణ ను లూఠీ చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో నేటివరకు ఒక్క డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కూడా లబ్ధిదారులకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సు ధాకర్‌రావు, జిల్లా ఇన్‌చార్జి నరేందర్‌రావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.సుబ్బారెడ్డి, దిలీప్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజవర్దన్‌రెడ్డి, కృష్ణ, నాగ రాజు, జలాల్‌ శివుడు, నాయకులు శేఖర్‌గౌడ్‌, పో ల్దాసు రాము, కొండ నగేష్‌, సుధాకర్‌రెడ్డి, సతీష్‌ కుమార్‌, శ్రీకాంత్‌ భీమా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T22:39:32+05:30 IST