15 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు

ABN , First Publish Date - 2022-05-31T05:28:37+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్రంలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా 15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షు డు రామచంద్రారెడ్డి తెలిపారు.

15 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు
గద్వాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న రామచంద్రారెడ్డి

- ముఖ్యకార్యకర్తల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి

- కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి : జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధారెడ్డి

గద్వాల/ఇటిక్యాల, మే 30 : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్రంలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా 15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షు డు రామచంద్రారెడ్డి తెలిపారు. గద్వాల పట్టణంలోని డీకే బంగ్లా, ఇటిక్యాల మండలంలోని బీచుపల్లిలో సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావే శాల్లో ఆయన మాట్లాడారు. ఈనెల 31 నుంచి వచ్చే నెల 14 వరకు సేవ, సుపరిపాలన, గరీబ్‌ కల్యాణ్‌ కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రతీ పోలింగ్‌ బూత్‌ పరిధిలోని ఓటర్లను కలిసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని సూచించారు. ప్రతీ మండలంలో 75 మంది కార్యకర్తలు 75 గంటల సమ యం ఇచ్చి  ప్రచారం చేయాలని సూచించారు. సీనియర్‌ నాయకులు వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి స్నిగా ్ధరెడ్డి, జలగరి అశోక్‌, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్‌ పాషా, ఓబీసీ అధికార ప్రతినిధి నాగేందర్‌ యాదవ్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కబీర్‌దాస్‌ నర్సింహ పాల్గొన్నారు. బీచుపల్లి లోని సాగర్‌ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం నిర్వహించిన ఇటిక్యాల మండల కార్యకర్తల సమావేశానికి మండల అధ్యక్షుడు ఎల్‌ జగదీశ్‌రెడ్డి అధ్యక్షత వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు కేకే రెడ్డి, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సాతర్ల అబ్దుల్లా, ఎస్పీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్‌, మండల నాయకులు బీసీరెడ్డి, మద్దిలేటి, రవిగౌడ్‌, శంకర్‌రెడ్డి, రంజిత్‌కుమార్‌, శారద, ప్రతాప్‌నాయుడు పాల్గొన్నారు. 


- కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధారెడ్డి కార్యకర్తలకు సూచించారు. బీజేపీ మండల అధ్యక్షుడు మహానందిరెడ్డి అధ్యక్షతన కేటీదొడ్డి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావే శానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్నిగ్ధారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పని చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఆనంద్‌, తిమ్మారెడ్డి, యువమోర్చా మండల అధ్యక్షుడు నందిన్నె మహాదేవ్‌, ప్రధాన కార్యదర్శి పద్మారెడ్డి, మండల కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు శ్రీపాదరెడ్డి, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వీరేష్‌, మహిళా మోర్చా అధ్యక్షురాలు కమలమ్మ, బీజే వైఎం మండల ఉపాధ్యక్షుడు అశోక్‌, నాయకులు సూర్యకాంతరెడ్డి, గుంతబాయి శ్రీను, మురళి, పద్మారెడ్డి, రంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కేంద్ర పథకాలను ప్రజలకు తెలియజేయాలి : బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి

మల్దకల్‌ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని బీజేవైఎం గద్వాల జిల్లా అద్యక్షుడు మీర్జాపురం వెంకటేశ్వరరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మల్దకల్‌ మండలంలో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశం లో ఆయన మాట్లాడారు. సమావేశానికి పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. నాయకులు రామకృష్ణ, వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మయ్య, లోకన్న, నాగరాజు, దామ వెంకటేశ్‌, మహేశ్‌, రాజమ్మ, చంద్రన్న, తిరుపతిరెడ్డి, జంగం రాజశేఖర్‌, లక్ష్మీనారాయణ, కిశోర్‌, గోవర్ధన్‌, నర్సింహులు, రఘుపతిరెడ్డి, పవన్‌ పాల్గొన్నారు. 


ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యం : మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ రామాంజనేయులు

గద్వాల : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని గద్వాల మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ రామాంజనేయులు పిలుపు నిచ్చారు. పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ అధ్య క్షతన గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో సోమవారం నిర్వహించిన మండల కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్‌ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కురుమన్న, యువ మోర్చా అధ్యక్షుడు పసుల రామకృష్ణ పాల్గొన్నారు. 


పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : రాష్ట్ర మాజీ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి

రాజోలి : భారతీయ జనతాపార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ ముఖ్య కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర మాజీ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. రాజోలిలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయనతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గడపగడపకూ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మండల ఉపాఽధ్యక్షుడు జీ రాము, ముఖ్య కార్యవర్గ కమిటీ సభ్యులు ఈసీ ఆంజనేయులు, శశికుమార్‌, గోవింద్‌రాజు, రాము, ఈరన్న పాల్గొన్నారు.


పరిష్కారం కాని సమస్యలు : బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేకే రెడ్డి 

అలంపూరు : అలంపూరు మునిసిపాలిటీలోని సమ స్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేకే రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు నాగమద్దిలేటి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమా వేశంలో ఆయన మాట్లాడారు. జోగుళాంబ, బాలబ్రహ్మే శ్వర స్వామి ఆలయాలకు వెళ్లే రహదారిపై మురుగునీరు ప్రవహిస్తోందన్నారు. జోగుళాంబ రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లను ఆపాలని కోరారు. 2009లో వచ్చిన వరదల్లో అలంపూరు ప్రజలు నిర్వాసితులయ్యారన్నారు. పునరా వాసం కోసం కేటాయించిన స్థలంలో ఇప్పటివరకు బాధితులకు పట్టాలు అందించలేదన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు జగదీష్‌, ఈశ్వరయ్య, శరత్‌, వినీత్‌కుమార్‌, నరేష్‌, పరశురాం, సతీశ్‌ పాల్గొన్నారు. 


అయిజ టౌన్‌ : భారతీయ జనతా పార్టీని గ్రామాలో సైతం బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్‌ పేర్కొన్నారు. మండల పరిధిలోని కొత్తపల్లిలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రవి హాజరయ్యారు. Read more