త్వరలో బర్డ్స్‌ ఎన్‌క్లోజర్‌

ABN , First Publish Date - 2022-11-12T23:17:24+05:30 IST

కేసీఆర్‌ అర్బ న్‌ ఎకోపార్క్‌ను దేశంలోనే నెంబర్‌వన్‌ పార్క్‌గా అభివృద్ధి చేసుకున్నామని, త్వరలోనే ఇక్కడ బర్డ్స్‌ ఎన్‌ క్లోజర్‌ను ఏర్పాటు చేసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

త్వరలో బర్డ్స్‌ ఎన్‌క్లోజర్‌
కోలాటం ఆడతున్న మహిళా ఉద్యోగులు, చిత్రంలో వీక్షిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

-800 రకాల పక్షలతో ఏర్పాటుకు చర్యలు

- రూ.3 కోట్ల నిధులు విడుదల

- మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌

- కేసీఆర్‌ అర్బన్‌ ఎకోపార్క్‌లో ఆహ్లాదంగా కార్తీక వనభోజనాలు

మహబూబ్‌నగర్‌, నవంబరు 12 : కేసీఆర్‌ అర్బ న్‌ ఎకోపార్క్‌ను దేశంలోనే నెంబర్‌వన్‌ పార్క్‌గా అభివృద్ధి చేసుకున్నామని, త్వరలోనే ఇక్కడ బర్డ్స్‌ ఎన్‌ క్లోజర్‌ను ఏర్పాటు చేసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఈ రోజే బర్డ్స్‌ ఎన్‌క్లోజర్‌ కోసం రూ.3 కోట్లు మంజూ రయ్యాయని ఆ యన తెలిపారు. శనివారం గౌడ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వ ర్యంలో కేసీఆర్‌ ఆర్బన్‌ ఎకోపార్క్‌లో కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మహిళా ఉద్యో గులు కోలాటాలతో సందడి చేశారు. చిన్నారులు సాంస్కృతిక నృత్య ప్రదర్శన చేశారు. మంత్రి శ్రీని వాస్‌గౌడ్‌ చిన్నారులకు బహుమతులను అందజే శారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఎకరా స్థలంలో దేశ, విదేశాల నుంచి 800 రకాల పక్షల ను తీసుకువచ్చి ఇక్కడ వదులుతామని చెప్పారు. భావితరాలకు అన్ని రకాల పక్షులను చూయించి, వారిలో మేధాశక్తిని పెంపొందించేందుకు ఈ ఎన్‌ క్లోజర్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అర్బన్‌ పార్క్‌లో కార్తీక వనభోజనాల కోసం ఉసిరి చెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. మహబూబ్‌ నగర్‌ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని తెలిపా రు. ఈ కార్యక్రమంలో విశ్రాంత, ఉద్యోగుల సం ఘం నాయకులు వెంకటస్వామిగౌడ్‌, రాజయ్యగౌడ్‌, లక్ష్మణ్‌గౌడ్‌, చక్రవర్తిగౌడ్‌, రవీందర్‌గౌడ్‌, గోపాల్‌ గౌడ్‌, నారాయణగౌడ్‌, వెంక య్యగౌడ్‌, సత్యనారా యణగౌడ్‌, దనుంజయ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T23:17:28+05:30 IST