-
-
Home » Telangana » Mahbubnagar » Biodiversity Act should be implemented-MRGS-Telangana
-
జీవ వైవిద్య చట్టాన్ని అమలుపర్చాలి
ABN , First Publish Date - 2022-09-09T04:45:00+05:30 IST
జీవ వైవిద్య చట్టం అమలులో జీవ వైవిద్య యాజమాన్య కమి టీలు కీలకపాత్ర పోషించి, చట్టాన్ని పకడ్బందీగా అమలుపర్చాలని జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు.

- జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి
- జీవ వైవిద్య చట్టం-2002పై ప్రజాప్రతినిధులకు ఒకరోజు శిక్షణ, అవగాహన
వనపర్తి అర్బన్, సెప్టెంబరు 8: జీవ వైవిద్య చట్టం అమలులో జీవ వైవిద్య యాజమాన్య కమి టీలు కీలకపాత్ర పోషించి, చట్టాన్ని పకడ్బందీగా అమలుపర్చాలని జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా అధికారుల భవనాల సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర జీవ వైవిద్య మం డలి ఆధ్వర్యంలో నిర్వహించిన జీవ వైవిద్య చ ట్టం-2002పై సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీ లు, జడ్పీటీసీలకు ఒకరోజు శిక్షణ, అవగాహన కా ర్యక్రమానికి జడ్పీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజర య్యారు. కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మా ట్లాడారు. తెలంగాణ రాష్ట్ర జీవ వైవిద్య మండలి ప్రాంతీయ సమన్వయకర్త శిల్పివర్మ మాట్లాడు తూ జీవ వైవిద్య చట్టం-2002 ముఖ్య ఉద్దేశం జీవ వనరులను సంరక్షించడంలో, కార్యక్రమాలను నిర్వహించడంలో, ప్రయోజనాలను వినియోగించ డంలో యాజమాన్య కమిటీల బాధ్యతను, హక్కు లను వివరించారు. స్టేట్ రిసోర్స్‌పర్సన్స్ టెక్నికల్ అసిస్టెంట్ అసద్ గోపి, పద్మ బీఎంసీలు కార్యా చరణ, రిజిస్టర్ల నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో అటవీశా తం తక్కువగా ఉన్నదని, అటవీశాతాన్ని పెంపొం దించాలని అన్నారు. గ్రామ పంచాయతీలకు జా తీయ అవార్డులు ఇస్తారని పంచాయతీలు పోటీ పడి పనిచేయాలని అన్నారు. అదనపు కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ మాట్లాడుతూ ఇటీవల వర్షాలు ఎక్కువగా వస్తున్నందున వరదలు వచ్చే ప్రమా దం ఉందని, సర్పంచులు అప్రమత్తంగా ఉండాల ని అన్నారు. పోషణమాసం నడుస్తున్నందున గర్భిణులు, బాలింతలు, పౌష్టికాహారం తీసుకోవా లని అన్నారు. ఓటర్‌కార్డుకు ఆధార్ కార్డు అను సంధానం చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయా లని ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వజ్రోత్సవాల నిర్వహణను వివరిం చారు. 16న ర్యాలీ, 17న జెండావిష్కరణ, 18న సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారులకు సన్మా నం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, డీఆర్డీవో పీడీ నర్సింహులు, సర్పంచులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎం పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.