అథ్లెటిక్స్‌లో భాగ్యలక్ష్మికి బంగారు పతకం

ABN , First Publish Date - 2022-02-23T05:34:00+05:30 IST

ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సి టీ చాంపియన్‌షిప్‌ క్రీడాపోటీల్లో జిల్లావాసి భాగ్యలక్ష్మి బంగారు పత కం సాధించిందని అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి స్వా ములు మంగళవారం తెలిపారు.

అథ్లెటిక్స్‌లో భాగ్యలక్ష్మికి బంగారు పతకం
భాగ్యలక్ష్మి

 ఉప్పునుంతల ఫిబ్రవరి 22: ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సి టీ చాంపియన్‌షిప్‌ క్రీడాపోటీల్లో జిల్లావాసి భాగ్యలక్ష్మి బంగారు పత కం సాధించిందని అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి స్వా ములు మంగళవారం తెలిపారు. ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన దొంతు భాగ్యలక్ష్మి సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళా శాల ఘట్‌కేసర్‌లో చదువుతూ ఉస్మానియా యూనివర్సిటీ తరుఫున  ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ పొటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభ కనబర్చిందన్నారు.  ఈ నెల 26నుంచి జూలై 9వరకు చైనా లో నిర్వహించనున్న వరల్డ్‌ యూనివర్సిటీ అథ్లెటిక్స్‌ పొటీలకు ఎంపికైనట్లు స్వాములు తెలిపారు. భాగ్యలక్ష్మి బంగారు పతకం సాధించడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు.

Read more