ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

ABN , First Publish Date - 2022-12-06T23:18:53+05:30 IST

ప్రభుత్వం కల్పించిన అన్ని సౌకర్యాలను సద్విని యోగం చేసుకొని ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని కలెక్టర్‌ వెంకట్రావు ఆదేశించారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకట్రావు

- కలెక్టర్‌ వెంకట్రావు

- నూతన కలెక్టరేట్‌లో

అధికారులతో సమావేశం

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, డిసెంబరు 6: ప్రభుత్వం కల్పించిన అన్ని సౌకర్యాలను సద్విని యోగం చేసుకొని ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని కలెక్టర్‌ వెంకట్రావు ఆదేశించారు. మంగళవారం నూతన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలను హెచ్చించి అన్ని కార్యాలయాలు ఒకే దగ్గరికి తీసుకురా వాలనే ఉద్దేశంతో సమీకృత నూతన కలెక్టరేట్‌ కార్యాలయాన్ని నిర్మించిందన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధికారులు బుధవారం నుంచి నూతన కలెక్టరేట్‌ నుంచే విధులు ప్రారంభిం చా లని ఆదేశించారు. ప్రభుత్వం కల్పించిన వసతుల ను సద్వినియోగం చేసుకుంటూ బంగా రు తె లంగాణ సాధనకు కృషి చేయాలని కోరారు. ప్ర తీ అధికారి, ఉద్యోగి తప్పనిసరిగా బయోమెట్రిక్‌ ఇవ్వాలని ఆదేశించారు. అధికారులందరు కార్యా లయాలను పరిశీలించుకొని తక్షణమే ఫైల్లు, టేబుళ్లు, కుర్చీలను తరలించుకొని విధులు నిర్వి ర్తించాలన్నారు. కలెక్టరేట్‌లో గార్డెనింగ్‌కు ఇబ్బం ది కలుగకుండా సహకరిం చాలని కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా శానిటేషన్‌ చేయించుకో వాలని ఆదేశిం చారు. శుక్రవారం నుంచి 1, 2 తప్ప అన్ని కార్యాలయాలు కూడా పూర్తిస్థాయిలో కొత్త కలెక్టరేట్‌ నుంచి పనిచే యాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవ ర్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అవసరమైతే ఎక్కువ బృందాలను ఏర్పాటు చేస్తాం

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ : రెండవ విడత కంటివెలుగు కార్యక్రమం నిర్వహ ణకు 32 బృందాలు అవసరమని, 2, 3 మండలాలలో జనాభా ఎక్కువగా ఉన్న చోట ఇంకా అవసరమైతే ఎక్కువ బృందాలను ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు తెలిపారు. కంటి వెలుగు నిర్వహణపై మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హైద రాబాద్‌ నుంచి వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో అన్నీ జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భ కలెక్టర్‌ మాట్లాడుతూ కంటి వె లుగు సక్రమ నిర్వహణకు పూర్తిస్థాయిలో సూక్ష్మప్రణాళిక తయారు చేసిన అనంతరం ఎక్సైజ్‌ శాఖ మంత్రి, జిల్లా మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతకు ముందు రాష్ట్ర వైద్య ఆరోగకయ శాఖ మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ జనవరి 18, 2023 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్య దర్శి రిజ్వి, ఫ్యామిలీవెల్ఫేర్‌ కమిషనర్‌ శ్వేతా మహాంతి, కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించి సూ చనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్‌చార్జి అధికారి డాక్టర్‌ శశికాంత్‌, డీపీవో వెంకటేశ్వర్లు, భూ త్పూర్‌, బాదేపల్లి కమిషనర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:18:57+05:30 IST