మెరుగైన వైద్య సేవలందించాలి

ABN , First Publish Date - 2022-09-22T04:48:08+05:30 IST

వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరు గైన వైద్య సేవలందించి వారి మన్ననలు పొందాలని రాష్ట్ర వైద్య విధాన పరి షత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ అన్నారు.

మెరుగైన వైద్య సేవలందించాలి
కల్వకుర్తి ఆసుపత్రిలో రోగుల వివరాలు అడిగి తెలుసుకుంటున్న కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌

- రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌


కల్వకుర్తి, సెప్టెంబరు 21: వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరు గైన వైద్య సేవలందించి వారి మన్ననలు పొందాలని రాష్ట్ర వైద్య విధాన పరి షత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ అన్నారు. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు, లేబర్‌రూమ్‌లను, రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఆసు పత్రిలో ప్రసవాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పాటు, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉండడంపై కమిషనర్‌ అభినందించారు. అనంతరం ఆయన విలే కర్లతో మాట్లాడుతూ వైద్య రంగానికి సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావులు అ ధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ డా.రమే ష్‌చంద్ర, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివరాం, డాక్టర్‌ యశోదబాయ్‌, డాక్టర్‌ స్వర్ణలత, సిబ్బంది పాల్గొన్నారు. 

 కొల్లాపూర్‌లో ప్రభుత్వ ఆసుపత్రుల పరిశీలన 

కొల్లాపూర్‌ : కొల్లాపూర్‌ పట్టణంలోని 50పడకల మాతాశిశు సంరక్షక ఆరో గ్య కేంద్రాన్ని, స్థానిక ఏరియా ఆసుపత్రిని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ బుధవారం పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు, పరికరాల కొరత, సిబ్బంది కొరతపై ఆయన ఆరా తీశారు. గర్భి ణులకు కేసీఆర్‌ కిట్టు అందజేసి వైద్య సేవల విధానం, వసతులపై వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కమిషనర్‌ను వైద్యులు, సి బ్బంది శాలువా, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ డీపీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రమేష్‌చంద్ర, సివిల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ బి. యాదగిరి, వైద్యులు ఎం.శ్రీనివాస్‌, రమేష్‌, సురేష్‌, జయచంద్రప్రసాద్‌యాదవ్‌, కావ్య, ఫార్మాసిస్టు జీకే.వెంకటేశ్‌, హెడ్‌నర్స్‌ నర్మద, సరోజినీ, ల్యాబ్‌ టెక్నీషి యన్‌ అనిత, రహీం, సురేందర్‌గౌడ్‌, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. 

Read more