ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య

ABN , First Publish Date - 2022-06-08T04:38:00+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్గిష్‌ మీడియం బోధి స్తున్నందుకు ప్రతీ ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని, ఇక్కడే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య
కొండూరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల చేత అక్షరాభ్యాసం చేయిస్తున్న కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌

- కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ 

- కొండూరులో చిన్నారులతో అక్షరాభ్యాసం 


పెంట్లవెల్లి, జూన్‌ 7: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్గిష్‌ మీడియం బోధి స్తున్నందుకు ప్రతీ ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని, ఇక్కడే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం మండలంలోని కొండూరు గ్రామం లో జరిగిన మన ఊరు, మన బడి, అదేవిధంగా పల్లెప్రగతి కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో సరస్వతి విగ్రహానికి పూజలు చేసి చిన్నపిల్లలను తన ఒళ్లో కూర్చొబెట్టుకొని అక్షరా భ్యాసం చేయించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో కొండూరు గ్రామ సర్పం చ్‌ గోపాల్‌, ఎంపీపీ ఉమామహేశ్వరి, ఆర్డీవో హ నుమానాయక్‌, ఎంపీడీవో రామయ్య, తహసీల్దార్‌ రమేష్‌, మత్స్యశాఖ ఏడీ లక్ష్మప్ప, ఎంపీవో భరత్‌ కుమార్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ రఫియోద్దీన్‌, ఉపాధ్యాయుడు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

మెరుగైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం : అడిషనల్‌ కలెక్టర్‌ 


ఊర్కొండ : మెరుగైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ప్రభుత్వం బడు లను బలోపేతం చేయడానికి మనఊరు, మన బడి కార్యక్రమం పేరిట పాఠశాలల్లో విద్యార్థు లకు సౌకర్యాలు కల్పిస్తున్నదని అడిషనల్‌ కలెక్టర్‌ మనుచౌదరి అన్నారు. మంగళవారం మండలం లోని రేవల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల ఆవరణ లో మనఊరు, మనబడి కార్యక్రమంలో భాగంగా నీటిట్యాంకు నిర్మాణానికి భూమిపూజ నిర్వహిం చారు. అనంతరం అధికారులతో పలు విష యాలపై చర్చించారు. మనఊరు, మనబడి పథ కంలో పాఠశాలకు వచ్చిన నిధులపై హెచ్‌ఎంను ప్రశ్నించగా ఆయన సరైన సమాధానం ఇవ్వక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పం చాయతీకి వస్తున్న నిధులపై ఆరా తీయగా.. స ర్పంచ్‌ బొబ్బిలి సునీత పూర్తి వివరాలు తెలి పారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్కరాధ, మండల ప్రత్యేకాధికారి చంద్రశేఖర్‌రావు, ఎంపీడీవో ప్రభా కర్‌, ఎంపీవో వెంకటేశ్వర్లు ఎంపీటీసీ లావణ్య, నా యకులు బక్కజంగయ్య, రమేష్‌, అమరేశ్వర్‌రెడ్డి, సాంబశివుడు, ఇంజనీరింగ్‌ అధికారులు ఉన్నారు. 

తాడూరు : మండలంలోని గోవిందా యపల్లి గ్రామంలో నిర్వహించిన బడిబాట కార్య క్రమంలో వైస్‌ ఎంపీపీ శివలీల విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. అంతకుముందు ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌, ఆ యా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, గ్రా మస్థులు, విద్యార్థులు ఉన్నారు. 

ఉప్పునుంతల : మండల కేంద్రంలో బడి బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉ న్నత పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసమూర్తి, సతీష్‌ ఇంటింటికి తిరుగుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, సౌకర్యాల గురించి వారు విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. 

Read more