వేసవికి ముందే

ABN , First Publish Date - 2022-03-05T04:24:21+05:30 IST

వేసవికి ముందే ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మాను ష్యంగా మారుతున్నాయి. గడిచిన వారంలో నల్లమలలో పగటి ఉష్ణోగ్ర తలు 35 డిగ్రీల నుంచి 37 డిగ్రీలకు పెరిగాయి. దాంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వేసవికి ముందే
మధ్యాహ్న వేళ నిర్మానుష్యంగా మారిన అచ్చంపేట ప్రధాన రహదారి

పెరిగిన ఉష్ణోగ్రతలు

ఉదయం చలి.. 10 గంటలు దాటాక ఎండ

మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా రోడ్లు


అచ్చంపేట, మార్చి 4: వేసవికి ముందే ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మాను ష్యంగా మారుతున్నాయి. గడిచిన వారంలో నల్లమలలో పగటి ఉష్ణోగ్ర తలు 35 డిగ్రీల నుంచి 37 డిగ్రీలకు పెరిగాయి. దాంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం చలి పెడుతుండగా, 10 గంటలు దాటాకా ఎండ పెరిగిపోతుంది. ఎండలు ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్‌లో ఇంకెలా ఉంటాయోనని భయపడుతున్నారు. ఎండ నుంచి రక్షణ పొందేందుకు గొడుగులు, చేతిరుమాళ్లు, తువ్వాళ్లు ధరిస్తున్నారు. చల్లని పానీయాలు తాగుతున్నారు. మూగ జీవాలు కూడా ఎండలతో ఇబ్బందులు పడుతున్నాయి. చెట్ల కింద సేదతీరుతున్నాయి.


ఎండలు ఎక్కువయ్యాయి

సలికాలం పోయిందో లేదో అప్పుడే ఎండలు ఎక్కువయ్యాయి. అప్పు డే ఉక్కపోస్తుంది. నెత్తి మీద తువ్వాల లేనిదే బయటికి పోతలేము. 

- తిరుపతయ్య, చెన్నారం

గొర్లు కాయాలంటే భయమేస్తుంది

ఎండలు పెరిగాయి. గొర్లు కాయాలంటే భయమేస్తుంది. నీళ్లు కూడా దొరుకుత లేవు. ఈ యేడు గొర్లను ఎట్ల కాయాలో ఏమో.

-బోజ్య, బుడ్డ తండా

Read more