బీల్‌వోలు విధిగా పనిచేయాలి

ABN , First Publish Date - 2022-11-27T22:43:49+05:30 IST

బీల్‌వోలు విధిగా పనిచేసి, 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా చూడాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు.

బీల్‌వోలు విధిగా పనిచేయాలి
పోలింగ్‌ బూత్‌లో బీఎల్‌వోలతో మాట్లాడుతున్న కలెక్టర్‌

- అర్హులు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునేలా చూడాలి

- కలెక్టర్‌ శ్రీహర్ష

దామరగిద్ద, నవంబరు 27 : బీల్‌వోలు విధిగా పనిచేసి, 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా చూడాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పోలింగ్‌ బూత్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసి బీల్‌వోల పనితీరును పరిశీలించి మాట్లాడారు. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు ఓటరు నమోదు, జాబితాలో పేర్లు మార్పు చేర్పులు, నియోజకవర్గం మార్పు, పోలింగ్‌ స్టేషన్‌ మార్పు వంటివి దరఖాస్తులు తీసుకొని తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లు చివరి నిమిషంలో హడావిడి చేయకుండా ఈ ప్రత్యేక క్యాంపెయిన్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో 90 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయని, ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌లో ఓ బీఎల్‌వోను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ రవికుమార్‌, బీఎల్‌వోలు ఉన్నారు.

Updated Date - 2022-11-27T22:43:52+05:30 IST