సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక

ABN , First Publish Date - 2022-09-27T05:04:14+05:30 IST

బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఎల్‌బీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ అన్నారు.

సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ  ప్రతీక
జడ్పీ మైదానంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ సీతారామారావు

 పాలమూరుయూనివర్శిటీ, సెప్టెంబరు 26: బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పాలమూరు యూనివర్సిటీ వీసీ  ప్రొఫెసర్‌ ఎల్‌బీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ అన్నారు. సోమవారం యూనివర్సిటీలో రెం డోరోజు అటుకుల బతుకమ్మ వేడుకలు జరిపారు. ఈసందర్భంగా విద్యారినులు, అధ్యాపకులు ప్రతీవిభాగం నుంచి ఒక్కో బతుకమ్మను తయారుచేసి రంగురం గుల పూలతో అలంకరించి,  ర్యాలీలుగా వ చ్చి పీజీ కేంద్రం వద్ద  బతుకమ్మల ను ఉంచారు. పీయూ వీసీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, రిజిస్ట్రార్‌ గిరిజామంగతాయారు తదితర అధికారులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆట-పాటలతో విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడారు. అనంతరం బహుమతులను అందజేశా రు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ప్రవీణ, పీజీ ప్రి న్సిపాల్‌ కి షోర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ కిృష్ణయ్య, పరీక్షల నిర్వహణాధికారి రాజ్‌కుమార్‌, ఎం ఈడీ కాలేజీ ప్రిన్సిపాల్‌ బషీర్‌, ఫార్మసీ ప్రిన్సిపాల్‌ సుజాత, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఫ మహబూబ్‌నగర్‌ టౌన్‌ : జిల్లా పరిషత్‌ మైదానంలో  సోమవారం రెండవరో జు  సర్వే ల్యాండ్‌, బీమా ప్రాజెక్టు ఉద్యోగుల ఆధ్వర్యంలో  బతుకమ్మ సంబు రా లు నిర్వహిం చారు.  ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్‌ సీతారామారావు పాల్గొని బ తుకమ్మలకు పూజ చే శారు.  అనంతరం బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్ర మంలో స్పెషల్‌ కలెక్టర్‌ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్‌ కుమార్‌, జిల్లా ఇన్ఫర్మేటిక్‌ అధికారి ఎం.వి.ఎస్‌.మూర్తి, జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ అధికారి జానీ పాషా పాల్గొన్నారు. అలాగే  స్థానిక రాంమందిర్‌ చౌరస్తాలోని రామాలయం వద్ద మేరు (దర్జీ) సంఘం ఆధ్వ ర్యంలో బతకమ్మ ఉత్సవాలు నిర్వహించారు.  

& మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: జిల్లా కేంద్రంలోని మోనప్పట్టలోగల జ్ఞానభారతి ఉన్నత పాఠశాలలో సోమవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా ట్రాస్మా అధ్యక్షుడు లక్ష్మ ణ్‌, పాఠశాల కరస్పాండెంట్‌ కిర్మణయి, రిషి విద్యాసంస్థల గౌరవ సలహాదారు వెంకటయ్య జిల్లా గౌరవ సలహదారు లక్ష్మణ్‌గౌడ్‌ , రాష్ట్ర ఉపాధ్యక్షుడు క్రాంతి కుమార్‌ , ఉపాధ్య క్షుడు వంశీ మోహన్‌రెడ్డి , కృష్ణమోహన్‌, రాందాష్‌ నాయక్‌, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ వేడుకలు  నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ శివలీల, అధ్యాపకులు విజయ్‌కుమార్‌, సత్యనారాయణ గౌడ్‌, తిరుపతయ్య, రాములు, ఈశ్వరయ్య, నర్సిములు, రాఘంవేందర్‌రెడ్డి, స్వరూప, అనిత, మల్లి ఖార్జున్‌, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-27T05:04:14+05:30 IST