పాఠశాలల్లో బతుకమ్మ సంబురాలు

ABN , First Publish Date - 2022-09-25T04:49:21+05:30 IST

నారాయణపేట పట్టణంలోని కృష్ణ గోకులం పాఠశాల, కాకతీ య స్కూల్‌లోని విద్యార్థులు శనివారం వివిధ రకాల పువ్వులతో బతుకమ్మలు తయారు చేసి బతుకమ్మ సంబురాలను నిర్వహించారు.

పాఠశాలల్లో బతుకమ్మ సంబురాలు
కృష్ణ మండల కేంద్రంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు

- ఆడిపాడిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

నారాయణపేట, సెప్టెంబరు 24 : నారాయణపేట పట్టణంలోని కృష్ణ గోకులం పాఠశాల, కాకతీ య స్కూల్‌లోని విద్యార్థులు శనివారం వివిధ రకాల పువ్వులతో బతుకమ్మలు తయారు చేసి బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, ఆయా పాఠశాలల నిర్వహకులు ఉమాదేవి, పూజ, కృష్ణవేణి, శ్వేత, సురేఖ పాల్గొన్నారు. 

నారాయణపేట రూరల్‌ : మండలంలోని లక్ష్మీపూర్‌, బోయిన్‌పల్లి,  సింగారం ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తీరొక్క పూలతో బతుకమ్మలను తయారు చేసి పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ ఆడా రు. అనంతరం సమీపంలో చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. హెచ్‌ఎంలు వై.జనార్దన్‌రెడ్డి, బనదయ్య, జయప్రకాశ్‌, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌, సంధ్య, శ్రీలత, కృష్ణారెడ్డి,  శ్రీనాథ్‌, నర్సిములు, వెంకటయ్య, రాజు, రుక్మాన్‌, చంద్రశేఖరస్వామి, జహంగీర్‌ పాల్గొన్నారు.

కృష్ణ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ పండుగ సంబురాల ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మలను తయారు చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ ఆడారు. హెచ్‌ఎం నిజాముద్దిన్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మక్తల్‌ రూరల్‌ : మండలంలోని మంథన్‌ గోడ్‌, అనుగొండ గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ పం డుగ సంబురాలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మను తయారు చేసి పాటలు పాడుతూ సంబురాలు జరుపుకున్నారు. హెచ్‌ఎం నాందేవ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 ధన్వాడ : ధన్వాడ సంత బజార్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు శనివారం బతుకమ్మ సంబు రాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థు లు బతుకమ్మలను తయారు చేసి నృత్యాలు చేశారు. బొడ్డెమ్మలు ఆడారు. అనంతరం వేంకటేశ్వర స్వామి బావిలో నిమజ్జనం చేశారు. హెచ్‌ఎం బాల్‌రాజు, శ్రీనివాసులు, సౌజన్య పాల్గొన్నారు.

మరికల్‌ :  మండలంలోని గాజులయ్య తండా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు శనివారం బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకు న్నారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మను తయారు చేసి గిరిజన పాటలు, బతుకమ్మ పాటలతో అడిపాడారు. అనంతరం చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు. హెచ్‌ఎం లక్ష్మయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మక్తల్‌ :  మక్తల్‌ పట్టణంతో పాటు మండలంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు శనివారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. పూలతో బతకమ్మలు తయారుచేసి ఆట పాటలతో అలరించారు. 

ఊట్కూర్‌ :  దసరా సెలవుల సందర్భంగా చివరి పని దినం కావడంతో శనివారం మండల వ్యాపితంగా ప్రభుత్వ పాఠశాలలో వివిధ రకాల పూలతో బతుకమ్మను తయారు చేసి ఆడిపాడారు. మండలంలోని నిడుగుర్తి, బిజ్వార్‌, అవుసులోన్‌పల్లి, చిన్నపొర్ల, కొత్తపల్లి పాఠశాలల్లో బతుకమ్మ ఆడటం పలువురిని ఆకర్షించింది. అనంతరం ఆయా చెరువుల్లో బతుకమ్మను నిమజ్జనం చేశారు. హెచ్‌ఎంలు చంద్రశేఖర్‌రెడ్ది, లక్ష్మారెడ్డి, గోపాల్‌, ధనుంజయ్‌, బన్నేష్‌, జగన్నాథ్‌రావు పాల్గొన్నారు.

Read more