ప్రాథమిక హక్కులపై అవగాహన ఉండాలి

ABN , First Publish Date - 2022-12-13T23:46:13+05:30 IST

రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులపై ప్రతీ ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ అధికార సేవాసంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి సంధ్యారాణి అన్నారు.

ప్రాథమిక హక్కులపై అవగాహన ఉండాలి

- సీనియర్‌ సివిల్‌ జడ్జి సంధ్యారాణి

మహబూబ్‌నగర్‌ లీగల్‌కంట్రిబ్యూటర్‌, డిసెంబరు 13 : రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులపై ప్రతీ ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ అధికార సేవాసంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి సంధ్యారాణి అన్నారు. జాతీయ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా జడ్జి ప్రేమావతి సూచనతో మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగంలోని చట్టాలు, మానవ హక్కులు, సివిల్‌ రైట్స్‌ను తెలుసుకుని చట్ట పరిధిలో నడుచుకోవాలన్నారు. ప్రతీ పౌరుడు రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛగా జీవించే హక్కును, పని చేసే హక్కును కలిగి ఉంటారన్నారు. ఈ కార్యక్రంలో కళాశాల ప్రిన్సిపాల్‌ గిరిధర్‌, మహిళా సాధికారత కో ఆర్డినేటర్‌ పుష్పలత పాల్గొన్నారు.

కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

- మునిసిపల్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల ధర్నా

పాలమూరు, డిసెంబరు 13 : మునిసిపల్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను వెంటనే పర్మినెంట్‌ చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి డిమాండ్‌ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం ఆధ్వర్యంలో కార్మికులు తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో మునిసిపల్‌, గ్రామ పంచాయతీ కార్మికులు ప్రాణాలకు తెగించి పనులు చేస్తూ వీధులు, వార్డులను శుభ్రం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం స్వచ్ఛత అవార్డ్‌ తీసుకోవడం వెనుక కార్మికుల కృషి ఎంతో ఉందన్నారు. అలాంటి కార్మికుల వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, పీఆర్‌సీ బకాయిలను చెల్లించడంలో 10 నెలలుగా నిర్లక్ష్యం చేస్తున్నారని, కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని ఎనిమిది ఏళ్లుగా చెబుతూనే ఉన్నారని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల కార్మికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఆకుల వెంకటేశ్‌, ఎర్ర నర్సింహులు, సీఐటీయూ కోశాధికారి చంద్రకాంత్‌, మునిసిపల్‌ వర్కర్స్‌ పట్టణ అధ్యక్షుడు కదిరె బాలరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు విశ్వనాథం, నాగభూషణం, అంజమ్మ, ఊర్మిళ, మహేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:46:16+05:30 IST