అయ్యప్ప స్వాముల నిరసన

ABN , First Publish Date - 2022-12-30T23:55:57+05:30 IST

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా అయ్యప్ప స్వామిని విమర్శించిన నాస్తిక సమాజం రాష్ట్ర నాయకుడు, కోస్గికి చెందిన బైరి నరేశ్‌పై కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ శుక్రవారం జిల్లా కేంద్రంలోని అం బేడ్కర్‌ చౌరస్తాలో అయ్యప్ప స్వాములు నిరసన వ్య క్తం చేశారు.

అయ్యప్ప స్వాముల నిరసన
కల్వకుర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న అయ్యప్ప స్వాములు

- స్వామిని విమర్శించిన నరేశ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

- పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, డిసెంబరు 30: హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా అయ్యప్ప స్వామిని విమర్శించిన నాస్తిక సమాజం రాష్ట్ర నాయకుడు, కోస్గికి చెందిన బైరి నరేశ్‌పై కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ శుక్రవారం జిల్లా కేంద్రంలోని అం బేడ్కర్‌ చౌరస్తాలో అయ్యప్ప స్వాములు నిరసన వ్య క్తం చేశారు. అయ్యప్పస్వాముల నిరసనకు పలు వురు బీజేపీ నాయకులు మద్దతు తెలుపుతూ ధర్నా లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు బుసిరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటు కన్వీనర్‌ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పోల్దాసు రాము, నాయకులు కొండ నాగేష్‌, చందు, అయ్యప్పస్వా ములు పాల్గొన్నారు.

- బిజినేపల్లి(కందనూలు) : బైరి నరేష్‌ను వెం టనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అయ్య ప్ప స్వాములు, భక్తులు, ప్రజలు బిజినేపల్లి అంబే డ్కర్‌ చౌరస్తాలో రాస్తారోకో చేసి, అనంతరం తహసీ ల్దార్‌ అంజిరెడ్డికి వినతిపత్రం అందించారు. నరేష్‌ను దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్‌ చేశారు.

- అచ్చంపేట టౌన్‌ : బైరి నరేశ్‌పై తక్షణమే కేసు నమోదు చేయాలని అయ్యప్ప సేవా సమితి మండల అధ్యక్షుడు మహేశ్‌ డిమాండ్‌ చేశారు. నరేశ్‌ వ్యాఖ్యలకు నిరసనగా పట్టణంలో ర్యాలీ నిర్వ హించి, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై గోవర్ధన్‌కు ఫి ర్యాదు చేశారు. కార్యక్రమంలో నాయకులు బాలాజీ, నల్లపుశ్రీను, చందూ, దేవేందర్‌, శివచంద్ర తదిత రులు పాల్గొన్నారు.

- అచ్చంపేట రూరల్‌ : బైరి నరేశ్‌ను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని శబరిమల అయ్య ప్ప సేవా సమితి నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు మేకల జయానంద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

- కల్వకుర్తి : బైరి నరేష్‌పై పీడీ యాక్టు కేసీ నమోదు చేయాలని కోరుతూ శుక్రవారం కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో అయ్యప్ప స్వాములు ఫిర్యాదు చేశా రు. నరేష్‌పై పీడీ యాక్టు కేసు నమోదు చేసి కఠినం గా శిక్షించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు నిరసనలు చేస్తామని హెచ్చరించారు. కా ర్యక్రమంలో అయ్యప్పస్వాములు పాండు, శ్రీనయ్య, రాజు, ఈశ్వర్‌ తదితరులున్నారు.

- చారకొండ : బైరి నరేశ్‌పై చర్యలు తీసుకోవా లని డిమాండ్‌ చేస్తూ అయ్యప్ప స్వాములు శుక్రవా రం మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బైరి నరేశ్‌పై పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అయ్యప్పస్వాములు గణేష్‌, చండీశ్వర్‌, కన్నా, మధు, శివ తదితరులున్నారు.

- వెల్దండ : హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ, ఆచారి మిత్ర మండలి నాయకులు ఎస్సై శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు విజేందర్‌రెడ్డి, ఆచారి మిత్రమండలి అధ్యక్షుడు మట్ట పరమేష్‌గౌడ్‌, బీజేవైఎం మండల అధ్యక్షుడు రవికుమార్‌, నాయకులు మల్లేష్‌, బాలకృష్ణ, శివప్రసాద్‌, రాజు, శరత్‌ ఉన్నారు.

- కొల్లాపూర్‌ : పట్టణంలోని ఎన్‌టీఆర్‌ చౌరస్తా లో అయ్యప్పస్వాములు రాస్తారోకో నిర్వహించి, ర్యాలీ చేపట్టారు. అనంతరం బైరి నరేష్‌పై పీడీ యాక్టు కేసు నమోదు చేయాలని, అతన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ అయ్యప్ప స్వామి ప్రజా సేవా సంస్థ భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ స్టేషన్‌ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కార్యక్రమం లో కృష్ణమనాయుడు, వెంకటస్వామి, రాకేష్‌, ప్రశాం త్‌, సుంకరి సురేందర్‌, మెంటే శివకృష్ణ, రవి, చందన శ్రీను, ప్రభాకర్‌రెడ్డి తదితరులున్నారు.

- అమ్రాబాద్‌ : బైరి నరేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని భజరంగ్‌దళ్‌ మండల శాఖ ఆధ్వర్యం లో శుక్రవారం అమ్రాబాద్‌ ఎస్సై వీరబాబుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మతాచారాలను కించ పర్చడం అవివేకమని ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నరే శ్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశా రు. ఫిర్యాదు చేసిన వారిలో భజరంగ్‌దళ్‌ మండల బాధ్యులు పగిడిపాల అనిల్‌, భిక్షపతి, కృష్ణయాదవ్‌, గంగిశెట్టి నాగరాజు, గోలిరాజు, అయ్యప్పసేవా సమా జం నాగర్‌కర్నూల్‌ జిల్లా నాయకులు కస్తూరి, బుచ్చి రాములు, సంబు వెంకటరమణ తదితరులున్నారు.

Updated Date - 2022-12-30T23:55:57+05:30 IST

Read more