పోషకాహార లోప నివారణపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2022-09-22T04:49:04+05:30 IST

పోషకాహార లోప నివారణపై ప్రజలకు అవగాహన కల్పిం చాలని జాతీయ పోషకాహార సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసన్‌ అన్నారు.

పోషకాహార లోప నివారణపై అవగాహన కల్పించాలి
కరపత్రాలు ఆవిష్కరిస్తున్న శ్రీనివాసన్‌, సుధాకర్‌లాల్‌ తదితరులు

- జాతీయ పోషకాహార సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసన్‌


మన్ననూర్‌, సెప్టెంబరు 21: పోషకాహార లోప నివారణపై ప్రజలకు అవగాహన కల్పిం చాలని జాతీయ పోషకాహార సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసన్‌ అన్నారు. బుధవారం మన్న నూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్యాధికారి సుధాకర్‌లాల్‌ అధ్యక్షతన ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మా ట్లాడారు. గ్రామీణ స్థాయిలో పోషకాహార లోపం ఎక్కువగా ఉందని, మార్పు తీసుకు రావ డానికి స్థానికంగా పనిచేసే సిబ్బందితో సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా గర్భిణీలు పోషకా హారం తీసుకోకపోవడం మూలంగా పుట్టబోయే పిల్లలపై ప్రభావం చూపుతుందని అన్నారు. గ్రామీణ స్థాయిలో అనాదిగా భుజించే సహజసిద్దమైన ఆహారపు అలవాట్లు తిరిగి పొందడం ద్వారా పోషకాహార లోపం నివారిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. కార్యక్రమంలో డా.అనంతన్‌, జిల్లా ఉప వైద్యాధికారి సురేష్‌బాబు, డా.భూపాల్‌, రెడ్‌క్రాస్‌ కార్యదర్శి రమేష్‌ రెడ్డి, ఎంసీ మెంబరు లోక్య, హరిలాల్‌, లక్ష్మణ్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-22T04:49:04+05:30 IST