తప్పుడు ప్రచారాన్ని మానుకోండి

ABN , First Publish Date - 2022-03-05T04:41:10+05:30 IST

మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్య కుట్రను తమ పార్టీ జా తీయ అధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ, పా ర్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్‌ రెడ్డిలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఈ తప్పుడు ప్రచార ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, మునిసిపల్‌ కౌన్సిలర్‌ అచ్చుగట్ల అం జయ్య డిమాండ్‌ చేశారు.

తప్పుడు ప్రచారాన్ని మానుకోండి
తెలంగాణ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీజేపీ నాయకులు


బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం


మహబూబ్‌నగర్‌(క్లాక్‌టవర్‌), మార్చి 4: మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్య కుట్రను తమ పార్టీ జా తీయ అధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ, పా ర్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్‌ రెడ్డిలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఈ తప్పుడు ప్రచార ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, మునిసిపల్‌ కౌన్సిలర్‌ అచ్చుగట్ల అం జయ్య డిమాండ్‌ చేశారు. బీజేపీ నేతల ఇళ్లపై రా ళ్లు రువ్వడం, కార్యకర్తలపై దాడి చేయడం తదితర తప్పుడు వ్యాఖ్యలను చిత్రీకరించి పార్టీపై తోయ డాన్ని ఆ పార్టీ నాయకులు నిరాకరిస్తు శుక్రవారం తెలంగాణ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణవ ర్దన్‌రెడ్డి, కిష్ట్యనాయక్‌, కౌన్సిలర్లు రామాంజనేయు లు, చిన్నవీరయ్య, పట్టణ అధ్యక్షుడు పోతుల రా జేందర్‌రెడ్డి, జిల్లా యువమోర్చా అధ్యక్షుడు కిరణ్‌ కుమార్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సుబ్రమణ్యం, ము త్రాల తిరుపతిరెడ్డి, రాజుగౌడ్‌, సంపత్‌కుమార్‌, వేణమ్మ, నాగరాజుయాదవ్‌, సత్యనారాయణయా దవ్‌, తదితరులు పాల్గొన్నారు. 

 జడ్చర్లలో...

జడ్చర్ల : బీజేపీ నాయకుల ఇళ్లపై దాడులకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను శుక్రవారం జడ్చర్ల అంబేడ్కర్‌ చౌరస్తాలో ఆ పార్టీ నాయకులు దహనం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు సామలనర్సి ములు, రమేశ్‌జీ, కుమ్మరిరాజు, కొంగళిశ్రీకాంత్‌, మధు, చెవ్వనాగరాజు, అమర్‌నాథ్‌గౌడ్‌, పిట్టల నరేశ్‌, తిరుపతి, అనంతకిషన్‌ తదితరులు పాల్గొన్నారు. 

హన్వాడ : బీజేపీ జాతీయ నాయకురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇళ్లపై కొం దరు వ్యక్తులు దాడి చేయడాన్ని నిరసిస్తూ శుక్ర వారం హన్వాడలో పార్టీ నాయకులు ధర్నా, రాస్తా రోకో చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి శ్రీని వాస్‌గౌడ్‌ దిష్టిబొమ్మలతో ర్యాలీ నిర్వహించి, దహ నం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షు డు డాక్టర్‌ వెంకటయ్య, జిల్లా కార్యదర్శి బుచ్చిరెడ్డి, జిల్లా, మండల నాయకులు రాములు, పుల్లయ్య, మణ్యం, లింగం, జుక్యనాయక్‌, వేణు, రమేష్‌, చెన్న ప్ప, నర్సిములు, మల్లేష్‌, కుర్మారెడ్డి, బాలగోపి, బా లరాజు తదితరులు పాల్గొన్నారు.

దేవరకద్ర : జిల్లా కేంద్రంలో బీజేపీ నేతల ఇళ్లపై టీఆర్‌ఎస్‌ నాయకుల దాడికి నిరసనగా శుక్రవారం మండల కేంద్రంలోని కురుమూర్తి చౌర స్తా వద్ద బీజేపీ జిల్లా కార్యదర్శి నారాయణరెడ్డి ఆ ధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చే శారు. కార్యక్రమంలో నాయకులు గోవిందు, మాధ వులు, శ్రీనువాసులు, రవి తదితరులు పాల్గొన్నారు. 

మహమ్మదాబాద్‌ : బీజేపీ జాతీయ నా యకుల ఇళ్లపై దాడి చేయడానికి నిరసిస్తూ బీజేపీ నాయకులు శుక్రవారం మండల కేంద్రంలోని అం బేడ్కర్‌ చౌరస్తాలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను ద హనం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్య క్షుడు కుర్వకృష్ణ, నాయకులు శ్రీనివాస్‌, నర్సిం ములు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

నవాబ్‌పేట : స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తాలో బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ద హనం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్య క్షుడు కారుకొండ రాజు, నాయకులు కొల్లి నర్సింహ, పస్పుల యాదయ్య, శ్రీనివాసులు, మల్లేష్‌, కమలా కర్‌, శేఖర్‌, రఘు, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

భూత్పూర్‌ : మండల కేంద్రంలో ముఖ్యమం త్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహ నం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్య క్షుడు బాల్‌రెడ్డి, మునిసిపల్‌ పట్టణ అధ్యక్షుడు రవీం దర్‌జీ, నాయకులు గొడుగు అంజన్న, ఎండీ.ఫారుక్‌, హరినాత్‌గౌడ్‌, గూటం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T04:41:10+05:30 IST