రాజీవ్‌ స్వగృహలో మిగిలిన ప్లాట్లకు వేలం: ఆర్డీవో

ABN , First Publish Date - 2022-02-20T05:15:16+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లాలో రాజీవ్‌ స్వగృహ కార్పోరేషన్‌( అంబర్‌ టౌన్‌ షిప్‌)మిగిలి ఉన్న ప్లాట్లను వేలం ద్వారా విక్రయిం చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్డీవో రాములు అన్నారు

రాజీవ్‌ స్వగృహలో మిగిలిన ప్లాట్లకు వేలం: ఆర్డీవో

గద్వాల క్రైం, ఫిబ్రవరి 19: జోగుళాంబ గద్వాల జిల్లాలో  రాజీవ్‌ స్వగృహ కార్పోరేషన్‌( అంబర్‌ టౌన్‌ షిప్‌)మిగిలి ఉన్న ప్లాట్లను వేలం ద్వారా విక్రయిం చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్డీవో రాములు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్‌ ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాకేంద్రంలోని అంబర్‌టౌన్‌ షిప్‌, నది అగ్రహారం రోడ్‌, అలుప్లెక్స్‌ గ్లాసు కంపెనీ ప్రక్కన్న రాజీవ్‌ స్వగృహ ప్లాట్‌లు మొత్తం 202మి గి లి ఉన్నాయని, 275నుంచి 511 చదరపు గజాల వరకు వివిధ విస్తీర్ణాలతో  పా ్లట్లు ఉన్నాయన్నారు. చదరపు గజానికి కనీస ధర రూ. 5,500 ఉంటుందన్నా రు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో మార్చి 14నుంచి 17వరకు ఓపెన్‌ ప్లాట్లకు వేలం నిర్వ హించనున్నట్లు తెలిపారు.  ప్రీబీడ్‌ సమావేశం మార్చి 7న ఉంటుందన్నారు. మొదటిసారి వేలంలో పాల్గొంటున్న వారు రూ. 10,000 డీడీ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల కోసం గతంలో రూ. 3000 చెల్లించిన వారు కూడా మీసేవా ద్వారా ఒరిజనల్‌ రశీదు కాపీని దరఖాస్తుకు జతపరిచి కలెక్టరేట్‌లో సమర్పించాలని ఆయన సూచించారు. సమావేశంలో తహసీల్దార్‌ లక్ష్మి, టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు నాగార్జున, జిల్లా కార్యదర్శి బీజాపూర్‌ ఆనంద్‌, అధికారులు, ఉపాధ్యాయులు ఉన్నారు.

 పాత దరఖాస్తుదారులకు ఇవ్వాలి 

 గద్వాల టౌన్‌ :  రాజీవ్‌ గృహకల్ప అంబర పేట కాలనీలో మిగిలి ఉన్న  202ప్లాట్లను గతంలో దరఖాస్తు చేసుకున్న వారికే అందజేయాలని  నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్‌ రంజిత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలోని యూనియన్‌ కార్యాలయంలో నాయకులు బుచ్చిబాబు, లవన్నల తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 2007లో ప్రభుత్వం ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన రాజీవ్‌ గృహకల్పలో ప్లాట్ల కోసం 906 మంది దరఖాస్తు చేసు కోగా, వారందరినీ కాదని కొత్తగా బహిరంగా వేలానికి  ప్రభుత్వం సిద్ధపడటం అన్యాయమన్నారు. కేవలం ఖజనా నింపుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంద న్నారు. అప్పట్లో దరఖాస్తు చేసుకుని సకాలంలో రిజిస్ర్టేషన్‌ చేసుకోని వారికి అవసరమైతే తగిన రీతిలో ఫెనాల్టీ విధించి ప్లాట్లను అప్పగించాలన్నారు. 

Read more