పతాకావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-09-17T05:49:51+05:30 IST

లంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న పతాకావిష్కరణ కార్యక్రమానికి పరేడ్‌ మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

పతాకావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతున్న ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌

- ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌ 

గద్వాల క్రైం, సెప్టెంబరు 16 : తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న పతాకావిష్కరణ కార్యక్రమానికి పరేడ్‌ మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ హాజరుకానున్నరని ఆయన తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు జాతీయ పతాకావిష్కరణ, 9.30 నిమిషాలకు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రాములు, అధికారులు పాల్గొన్నారు. 


Read more