అలరించిన మ్యూజికల్‌ నైట్‌

ABN , First Publish Date - 2022-12-30T23:53:28+05:30 IST

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్‌రెడ్డి జన్మది నాన్ని పురస్కరించుకుని జడ్చర్ల మినీ స్టేడియంలో శుక్రవారం రాత్రి నిర్వ హించిన మ్యూజికల్‌ నైట్‌ అలరించింది.

అలరించిన మ్యూజికల్‌ నైట్‌

జడ్చర్ల, డిసెంబరు 30: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్‌రెడ్డి జన్మది నాన్ని పురస్కరించుకుని జడ్చర్ల మినీ స్టేడియంలో శుక్రవారం రాత్రి నిర్వ హించిన మ్యూజికల్‌ నైట్‌ అలరించింది. జడ్చర్లలో మొదటిసారి మ్యూజికల్‌ నైట్‌ నిర్వహించడంతో పట్టణ వాసులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రముఖ గాయ కులు మనో, లిప్సిక పాటలు, బిత్తిరి సత్తి అభినయం, పల్సర్‌ ఝాన్సీ నృత్యాలు, జబర్దస్త్‌ టీం సభ్యుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సుమారు 20 నిమిషాల పాటు ఏకధాటిగా బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, టీపీసీసీ ఉపా ధ్యక్షుడు డాక్టర్‌ మల్లురవి, జడ్చర్ల, బాలానగర్‌, రాజాపూర్‌, నవాబ్‌పేట, మిడ్జిల్‌, ఊర్కొండ మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T23:53:28+05:30 IST

Read more