దుర్గాదేవీగా అమ్మవారు

ABN , First Publish Date - 2022-10-04T05:06:24+05:30 IST

శరన్నవరాత్రి ఉ త్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జిల్లా కేం ద్రంలోని ఆయా ప్రాంతాల్లో ప్రతిష్టించిన దుర్గాదేవీ మండపాల వద్ద ప్రతీ రోజు ప్రత్యేక కార్యక్రమా లను నిర్వహిస్తున్నారు.

దుర్గాదేవీగా అమ్మవారు
ధన్వాడ దత్తాత్రేయ ఆలయంలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు

- కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు

నారాయణపేట, అక్టోబరు 3 : శరన్నవరాత్రి ఉ త్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జిల్లా కేం ద్రంలోని ఆయా ప్రాంతాల్లో ప్రతిష్టించిన దుర్గాదేవీ మండపాల వద్ద ప్రతీ రోజు ప్రత్యేక కార్యక్రమా లను నిర్వహిస్తున్నారు. సుభాష్‌రోడ్‌ శక్తిపీఠం అమ్మవారి ఆలయం, బ్రాహ్మణ్‌వాడీ చౌడేశ్వరి ఆల యం, మలాంబికదేవీ మందిరం, వైష్టవి దేవి, లోకా యపల్లి అమ్మవారి ఆలయాల్లో ఆఽధ్యాత్మిక కార్యక్ర మాలు కొనసాగుతున్నాయి. బాపూనగర్‌లో ప్రతి ష్టించిన అమ్మవారి మండపం వద్ద లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ హరినారాయణ్‌భట్టడ్‌ ప్రా రంభించారు. సరాఫ్‌బజార్‌లో ప్రతిష్టించిన దుర్గాదే వీ అమ్మవారి మండపం వద్ద సాయంత్రం శివపా ర్వతుల కల్యాణం కార్యక్రమాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. కాగా జిల్లా కేంద్రంలో ప్రతిష్టించిన దుర్గాదేవీ అమ్మవారిని ఈనెల 6వ తేదీన శోభా యాత్ర నిర్వహించి స్థానిక కొండారెడ్డిపల్లి చెరువు లో నిమజ్జనం చేయనున్నారు. 

నారాయణపేట రూరల్‌ : మండలంలోని కోటకొండ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో, సింగారం శ్రీగిరి పీఠం భవాని మాత ఆలయంలో అమ్మవార్లు దుర్గాదేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. కొల్లంపల్లి, కోటకొండ నర్సాచలం వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో సైతం ప్రత్యేక పూజలు కొనసాగాయి.

మక్తల్‌ : నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మ క్తల్‌ పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆల యంలో వాసవీమాత సోమవారం దుర్గాదేవీగా ద ర్శనం ఇచ్చారు.  అమ్మవారిని సాయంత్రం సింహ వాహనంపై ఊరేగించారు.  శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని అశ్వ వాహనంపై ఊరే గించారు. నల్లజానమ్మ ఆలయంలో అమ్మవారు ప్ర త్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. వా  సవీమాత ఆలయం వద్ద గణపతిపూజ, కలశపూజ, అభిషేకం, రాత్రి తెప్పోత్సవం నిర్వహించారు. 

కృష్ణ : నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండల కేంద్రంతో పాటు వాసునగర్‌ అంబా భవాని ఆలయంలో మహిళలు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం బతుకమ్మ సంబురాల్లో భాగంగా ఆడిపాడారు.

 ధన్వాడ : నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన దుర్గామాతతో పాటు గంగామాత ఆలయం, దత్తాత్రేయ ఆలయం, అంబభవాని ఆల యాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాత వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు. 
Read more