అంబేడ్కర్‌ సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2022-12-06T23:11:47+05:30 IST

రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సేవలు చిరస్మరణీయం అని ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

అంబేడ్కర్‌  సేవలు చిరస్మరణీయం
పేటలో అంబేద్కర్‌ విగ్రహానికి నివాళ్లు అర్పిస్తున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు

- ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి

- నివాళి అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

నారాయణపేట/టౌన్‌, డిసెంబరు 6 : రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సేవలు చిరస్మరణీయం అని ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్‌ 66వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళి అర్పించారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ చిత్రపటానికి జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ ఆంజనేయులు గౌడ్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. జడ్పీ సీఈవో జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు. అదే విధంగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ అందరికీ ఆదర్శమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రతంగ్‌ పాండురెడ్డి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు విజయ్‌, ప్రభాకర్‌వర్ధన్‌, నర్సిములు, సిద్ధి వెంకట్రాములు, ఆశప్ప, రఘురామయ్య, మల్లేష్‌, సత్య రఘుపాల్‌, రమేష్‌, గోపాల్‌, కృష్ణ, లక్ష్మణ్‌, లింగరాజ్‌ పాల్గొన్నారు. ముదిరాజ్‌ సంఘం నాయకులు అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. పట్టణ అడ్‌హక్‌ కమిటీ అధ్యక్షుడు మిర్చి వెంకటయ్య, గురు మేస్త్రీ, సరాఫ్‌ నాగరాజ్‌, వెంకట్రాములు, గురు లింగప్ప, కార్తీక్‌, లక్ష్మీకాంత్‌, ఓంప్రకాష్‌, పాండు, నర్సిములు, లక్ష్మీకాంత్‌, సంజీవ్‌ ప్రకాష్‌ పాల్గొన్నారు. కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ చిత్రపటానికి ప్రిన్సిపాల్‌ నరేష్‌, ప్రభాకర్‌, సిబ్బంది నివాళి అర్పించారు.

ధన్వాడ : మండల కేంద్రంతో పాటు మండలంలోని కొండాపూర్‌, గోటూర్‌, కిష్టాపూర్‌ గ్రామాల్లో అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించారు. ధన్వాడ గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్‌ చిట్టెం అమరేందర్‌రెడ్డి అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఎస్‌ఐ రమేష్‌, కిష్టాపూర్‌ సర్పంచ్‌ దామోదర్‌రెడ్డి, అంబేడ్కర్‌ సంఘం నాయకులు కిష్టాపూర్‌ గండి బాల్‌రాజు, ఊసు రవికూమార్‌, బాల్‌రాజు, గోటూర్‌ రాజ్‌కుమార్‌, రాజేష్‌, బీఎస్పీ నాయకులు బొదిగేలి శ్రీనివాసులు, ఎలిగెండ్ల వెంకటేష్‌, గుర్రం రాజు, జడల బాల్‌రాజు, అరవింద్‌ పాల్గొన్నారు.

నర్వ : మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో దళిత సంఘం నాయకులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సర్పంచ్‌ పెద్దింటి సంధ్య ఆంజనేయులు, వైస్‌ ఎంపీపీ దండు వీణావతి శంకర్‌, దళిత సంఘం నాయకులు గుడిసె వెంకటయ్య, శరణప్ప, దండు అయ్యప్ప, ఆంజనేయులు, పాండు, వెంకటయ్య పాల్గొన్నారు.

మరికల్‌ : రాజ్యాంగాన్ని మార్చడానికి టీఆర్‌ఎస్‌, బీజేపీలు కుట్ర పనుతున్నారని పేట నియోజకవర్గ బీఎస్పీ ఇన్‌చార్జి బొదిగెల శ్రీనివాసులు పేర్కొన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలో అంబేడ్కర్‌ విగ్రహానికి ఎమ్మార్పీఎస్‌, బీఎస్పీ నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. చంద్రయ్య, చంద్రకాంత్‌, రాజు, చెన్నయ్య, రామస్వామి, శివకుమార్‌ పాల్గొన్నారు.

మక్తల్‌/రూరల్‌ : అంబేడ్కర్‌ యువజన సంఘం, అంబేడ్కర్‌ విగ్రహ పునర్‌ స్థాపన కమిటీ, కాంగ్రెస్‌, బీఎస్పీ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ వర్ధంతిన ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాల్గొని ప్రతీ ఒక్కరూ అంబేడ్కర్‌ అడుగుజాడల్లో నడవాలన్నారు. అంబేడ్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు నర్సిములు, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు ఆనంద్‌, అంబేడ్కర్‌ సంఘం నాయకులు ఆచ్చప్ప, కురుమయ్య, సాయి, గణేష్‌, మారెప్ప, వెంకటేష్‌, మద్దిలేటి, పోలప్ప, దత్తాత్రేయ, నారాయణ, హైమావతి, రవికుమార్‌, పృథ్విరాజ్‌, మొగిలప్ప, రాములు, సూర్యప్రకాష్‌, సూర్యచంద్ర పాల్గొన్నారు. అదే విధంగా మండలంలోని రుద్రసముద్రం, పంచలింగాల ప్రాథమికోన్నత పాఠశాలలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సర్పంచు లక్ష్మి శ్రీనివాస్‌గౌడ్‌, హెచ్‌ఎం భీమ్‌రెడ్డి పాల్గొన్నారు.

కృష్ణ : మండల కేంద్రంతో పాటు గుడెబల్లూరులోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఇన్‌చార్జి తహసీల్దార్‌ సురేష్‌ పాల్గన్నారు.

మాగనూరు : మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి ఎంపీపీ శ్యామలమ్మ, అంబేడ్కర్‌ సంఘం అధ్యక్షుడు రమేష్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. సింగిల్‌ విండో అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు ఆనంద్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మధుసూదన్‌రెడ్డి, సత్యప్ప, మారెప్ప, అశోక్‌గౌడ్‌ పాల్గొన్నారు.

దామరగిద్ద : మండలంలోని దామరగిద్ద, క్యాతన్‌పల్లి, విఠలాపూర్‌, ఉల్లిగండం, కందెన్‌పల్లి గ్రామాల్లో ప్రజాప్రతనిధులు అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విఠలాపూర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి భూమిపూజ చేశారు. ఎంపీపీ నర్సప్ప, వైస్‌ ఎంపీపీ దామోదర్‌రెడ్డి, సర్పంచ్‌ నిర్మల పరశురాంరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి బాబురావు, రఫీ, నర్సప్ప, అశోక్‌, పాడు, నర్సింహ ఉన్నారు.

Updated Date - 2022-12-06T23:11:48+05:30 IST