ఏదులాపూర్‌లో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2022-08-18T04:22:12+05:30 IST

మండలంలోని ఏదులాపూర్‌ గ్రామంలో బుధవారం అంబే డ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.

ఏదులాపూర్‌లో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ
ఏదులాపూర్‌లో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం

- హాజరైన జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు

చిన్నచింతకుంట, ఆగస్టు 17 : మండలంలోని ఏదులాపూర్‌ గ్రామంలో బుధవారం అంబే డ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి, మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ రాజేశ్వరి, గ్రామ సర్పంచ్‌ హేమలత, ఎంపీటీసీ ఉషారాణి, నాయకులు కోట రాము, జైపాల్‌రెడ్డి, వట్టెం రాము పాల్గొన్నారు.  

Read more