పోడు రైతులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-12-30T23:57:26+05:30 IST

జిల్లాలో పోడు భూముల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీ రైతుకు హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు.

పోడు రైతులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలి
కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు, పోడు రైతులు

- సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ

- కలెక్టరేట్‌ వద్ద పోడు రైతుల ధర్నా

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, డిసెంబరు 30: జిల్లాలో పోడు భూముల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీ రైతుకు హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో పోడు రైతులు పట్టణంలోని బాబుజగ్జీవన్‌రాం భవన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడు తూ పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వా లని జిల్లా వ్యాప్తంగా 12,500 మంది పోడు రైతు లు ధరఖాస్తు చేసుకుంటే కేవలం 300 మందికి హక్కు పత్రాలు ఇవ్వడం దారుణమన్నారు. జిల్లా లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతాంగం తరతరాలుగా పో డు భూములు సాగు చేసుకుంటుండగా ఫారెస్టు, రెవెన్యూ అధికారులు సక్రమంగా సర్వేలు చేయ కుండా వాటిని ప్రభుత్వం స్వాదీనం చేసుకునే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతీ పోడు రైతుకు పట్టాలిచ్చే వరకు సీపీఎం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌కు అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.శ్రీనివాస్‌, కె.గీత, గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దేశ్యానాయక్‌, శంకర్‌నాయక్‌, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా నాయకులు మల్లేష్‌, అశోక్‌, శివవర్మ, రామయ్య, వెంకటేష్‌, దశరథం, తారాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T23:57:26+05:30 IST

Read more