బహుజనులందరూ ఏకం కావాలి

ABN , First Publish Date - 2022-10-19T04:32:43+05:30 IST

భవిష్యత్‌ తరాల సమగ్రాభివృద్ధి, విద్యావ్యాప్తి కోసం, గద్వాల నియోజక వర్గం కుటుంబ పాలన నుంచి విముక్తి పొందేలా బహుజనులంతా ఏకం కావాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్‌ గొంగళ్ల రంజిత్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

బహుజనులందరూ ఏకం కావాలి
సమావేశంలో మాట్లాడుతున్న రంజిత్‌కుమార్‌, హాజరైన ముఖ్య కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు

- ముఖ్య కార్యకర్తల సమావేశంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్‌ రంజిత్‌కుమార్‌

గద్వాల టౌన్‌, అక్టోబరు 18 : భవిష్యత్‌ తరాల సమగ్రాభివృద్ధి, విద్యావ్యాప్తి కోసం, గద్వాల నియోజక వర్గం కుటుంబ పాలన నుంచి విముక్తి పొందేలా బహుజనులంతా ఏకం కావాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్‌ గొంగళ్ల రంజిత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఇందుకోసం జనాభాలో 93 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలన్నీ ఒకే జెండా, అజెండాగా ముందుకు కదలాలని కోరారు. ఆ దిశగా సమితి చేస్తున్న పోరాటంలో ప్రతీ ఒక్కరూ భాగస్వా ములు కావాలని అభ్యర్థించారు. పట్టణంలోని ఇండి యన్‌ ఫంక్షన్‌హాల్‌లో ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సంస్థాగత బాధ్యుల కుటుంబ సభ్యులతో మంగళ వా రం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్‌కుమార్‌ మాట్లాడుతూ నియోజక వర్గం ఏర్పడిన నాటి నుంచి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఒకే సామాజిక వర్గానికి, ముఖ్యంగా ఒకే కుటుంబానికి టికెట్లను ఇవ్వడం వెనుక బీసీలను అణచివేసి అధికారానికి దూరంగా ఉంచే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. పార్టీలు టిక్కెట్లు ఇవ్వక పోయి నా బహుజనులంతా ఏకం కావాలని, ఇందుకు ప్రతీ ఒక్కరు కంకణబద్దులు కావాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు పెత్తందారుల ఆధిపత్యానికి, బహుజనుల ఆత్మగౌరవానికి మధ్య జరిగే పోరాటమన్నారు. సమా వేశానికి సమితి కన్వీనర్‌ బుచ్చిబాబు, కార్యదర్శి లవ న్న, రేణుక, సాహితి, విష్ణు, ప్రేమ్‌రాజ్‌, తిమ్మప్ప, లక్ష్మన్న, కృష్ణ, గుండన్న, రాహుల్‌, పరశురాముడు, గోవిందు, మునెప్ప, భీమన్నగౌడ్‌, బలరాం, వెంక ట్రాములు, కర్రెప్ప హాజరయ్యారు.

Updated Date - 2022-10-19T04:32:43+05:30 IST