రేషన్‌ షాపులలో అన్ని ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2022-12-30T23:51:40+05:30 IST

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్‌ షాపుల్లో పది రోజులలోపు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ అన్నారు.

రేషన్‌ షాపులలో అన్ని ఏర్పాట్లు చేయాలి

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌

వనపర్తి అర్బన్‌, డిసెంబరు 30: ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్‌ షాపుల్లో పది రోజులలోపు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో తహసీ ల్దార్లు, డీటీలు, పౌరసరఫరాల అధికారులతో ఆయన సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాది కా అమృత్‌ మహోత్స వం కార్యక్రమంలో భాగంగా దేశంలోని ఐదువేల చౌకధర దుకాణాలను మోడల్‌ అధికారులు పరిశీలిస్తారని తెలిపారు. చౌకధర దుకాణాల యొక్క మౌళిక సదుపాయాలు, అవసరాలు, నాణ్యత, నియంత్రణ చర్యలు, లబ్ధిదారుల అనుభవం, సర్వీస్‌ డెలివరీ, పారదర్శకత ఫిర్యాదుల పరిష్కారం, ఫ్లెక్సీ ఏర్పాటు, సీసీ కెమెరాలు, సూచికలు ఏర్పాటు, తదితర అంశాలపై ఆయన సూచనలు అందించారు. 10 రోజులలోపు అన్ని దుకాణాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఈవో పద్మావతి, డీఎస్‌వో సుదర్శన్‌, తహసీల్దార్‌లు రాజేందర్‌గౌడ్‌, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T23:51:40+05:30 IST

Read more