రైతుల కోసం ఎన్నో పథకాలు

ABN , First Publish Date - 2022-01-04T05:22:27+05:30 IST

రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు.

రైతుల కోసం ఎన్నో పథకాలు
రైతు సంబురాల్లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అబ్రహాం

- రైతు సంబురాల్లో అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం

అలంపూర్‌ చౌరస్తా, జనవరి 3 : రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. మండలంలోని ఏబూడిదపాడు గ్రామంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన రైతు సంబురాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మే ముఖ్యమంత్రి మనకు ఉండటం గర్వకారణమని తెలిపారు. రైతుబంధు పథకంతో రైతులు వ్యవసాయ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి మారిందన్నారు. రైతు చనిపోతే అతడి కుటుంబం వీధిన పడకుండా రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికలకు ఏ పార్టీ కూడా మాకు పోటీ కానేకాదని చెప్పారు. మరో రెండు మూడు సార్లు కేసీఆరే ముఖ్యమంతి అవుతారని జోస్యం చెప్పారు. 


ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు

అలంపూరు : నూతన సంవత్సరాన్ని 2022ను పురస్కరించుకుని అలంపూరు, ఉండవల్లి, మానవపాడు, ఇటిక్యాల మండలాల విద్యాధికారులు సోమవారం అలంపూరు ఎమ్మెల్యే అబ్రహాంకు శుభాకాంక్షలు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి పుష్ఫగుచ్ఛం అందించి, శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో విద్యాధికారులు ఈ రాజు, ఆర్‌ అశోక్‌కుమార్‌, శివప్రసాద్‌, జీహెచ్‌ఎం విష్ణు తదితరులు పాల్గొన్నారు. 

Read more