పట్టణాభివృద్ధికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-05-18T05:41:54+05:30 IST

అయిజ పట్టణాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం సూచించారు.

పట్టణాభివృద్ధికి కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అబ్రహాం

- మునిసిపల్‌ సమావేశంలో అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం

అయిజ టౌన్‌, మే 17 : అయిజ పట్టణాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం సూచించారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అథితి గృహంలో చైర్మన్‌ దేవన్న ఆధ్వర్యంలో నిర్వహించిన మునిసిపల్‌ సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడారు. సమావేశంలో 18 ఎజెండా ఆంశాలు, రెండు టేబుల్‌ ఆంశాలు, మెత్తంగా 20 ఆంశాలను కౌన్సిల్‌లో ప్రవేశ పెట్టారు. వాటిలో 19 ఆంశాలను కౌన్సిల్‌ ఆమోదించింది. తైబజార్‌ వసూలు ఆంశాన్ని తిరస్కరించింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తైబజార్‌ను రద్దు చేయాలని తీర్మానించింది. కార్యక్రమంలో  కమిషనర్‌ నర్సయ్య, వైస్‌ చైర్మన్‌ నరసింహులు, ఏఈ గోపాల్‌, మేనేజర్‌ రాజేష్‌ కుమార్‌, రమేష్‌, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, మునిసిపల్‌ అధికారులు పాల్గొన్నారు. 

Read more