కార్యకర్తలు ఎన్నికలకు సన్నద్ధం కావాలి

ABN , First Publish Date - 2022-01-24T04:29:27+05:30 IST

రానున్న ఎన్నికలకు కాంగ్రెస్‌ కార్యకర్తలంతా స న్నద్ధం కావాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

కార్యకర్తలు ఎన్నికలకు సన్నద్ధం కావాలి
సభ్యత్వం నమోదు చేస్తున్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌

- ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌

ఎర్రవల్లిచౌరస్తా, జనవరి 23: రానున్న ఎన్నికలకు కాంగ్రెస్‌ కార్యకర్తలంతా స న్నద్ధం కావాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఇటిక్యాల మండలంలోని జింకలపల్లి స్టేజీ దగ్గరున్న కాంగ్రెస్‌ కార్యాల యంలో ఆదివారం కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదుకు మొట్టమొదటిసారిగా బూత్‌ ఎన్‌రోల్‌ చేస్తుందని, ప్రతీ కార్యకర్త సభ్య త్వం నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.  ప్రమాదవశాత్తు  మరణించిన కార్యకర్త కుటుంబానికి ప్రమాదబీమా రూ.2లక్షలు కాంగ్రెస్‌ అందిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేఖ విధానాలను తెలియపరుస్తూ సభ్యత్వం నమోదు చేయాలని సూచించారు. రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమని, పూర్వవైభవం తెచ్చేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నియెజకవర్గ సమన్వయకర్త లక్ష్మీనారాయణరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నరసింహ,  నాయకులు  శ్యామ్‌సుందర్‌,  సుధాకర్‌రెడ్డి, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Read more