తప్పు చేసిన ప్రతీ ఒక్కరిపై చర్యలు తీసుకుంటాం

ABN , First Publish Date - 2022-12-02T00:01:35+05:30 IST

ముని సిపల్‌ కార్యాలయం లో తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని ఉపే క్షించేది లేదని, తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటా మని వనపర్తి మునిసి పల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌ అన్నారు.

తప్పు చేసిన ప్రతీ ఒక్కరిపై చర్యలు తీసుకుంటాం

వనపర్తి టౌన్‌, డిసెంబరు 1: ముని సిపల్‌ కార్యాలయం లో తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని ఉపే క్షించేది లేదని, తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటా మని వనపర్తి మునిసి పల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌ అన్నారు. గు రువారం మునిసిపల్‌ కమిషనర్‌ విక్రమసింహరెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బిల్‌ కలెక్టర్లు బ్యాంకులో జమ చేయమని ఇచ్చిన దాదాపు రూ. 10 లక్షలతో పారిపోయిన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిపై అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారని అన్నారు. విచారణలో ఉద్యోగి రూ. 7 లక్షల 46 వేలు తీసుకుని పారిపోయినట్లు రికార్డుల పరంగా రుజువైందన్నారు. సదరు ఉద్యోగి నలుగురు బిల్‌ కలెక్టర్లతో ఒకరితో రూ. రెండు లక్షల 93 వేల, ఒకరితో రూ. లక్ష 56 వేలు, మరొకరితో రూ. లక్ష 68 వేలు, ఇంకొకరితో రూ. 75 వేలు తీసుకొని బ్యాంకులో జమ చేస్తానని చెప్పి మోసం చేశాడని అన్నారు. మరో ఉద్యో గి జూనియర్‌ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తూ 2021 జనవరి, 2022 జనవరి, పిబ్రవరి లో క్యాషియర్‌గా అదనపు బాధ్యతలు చేశాడని, అదే సమయంలో మూడు నెలలకు కలిపి రూ. 4 లక్షల 50 వేలు బ్యాంకులో జమ చేయకుండా తన స్వంత ఖర్చులకు వాడుకున్నా డని తెలిపారు. సొమ్మును రికవరీ చేశామన్నారు. వీరిద్దరితో పాటు మరో ఉద్యోగి జూని యర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూ పట్టణంలో ట్యాక్స్‌ వసూలు చేసేవాడని, ఈ ఉద్యో గి ఏకంగా ఒకే వ్యక్తితో 2020-21, 22 సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్ను సంవత్సరా నికి రూ. 82వేల 371 లను నకిలీ రశీదులు ఇచ్చి వసూలు చేసుకున్నాడని అన్నారు. దీంతో ఈ ఉద్యోగిని సస్పెండ్‌ చేసి క్రిమినల్‌ కేసు పెట్టాలని అధికారిక ఆదేశాలు వచ్చాయన్నారు. పట్టణంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతీ ఒక్క బిల్లులు ఆన్‌లైన్‌ పద్ధతిలోనే పొందాలని, ఆన్‌లైన్‌ బిల్లులు ఇచ్చిన వారికి మాత్రమే ట్యాక్స్‌ కట్టాలని సూచించారు. సమావేశంలో ఆర్‌వో అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:01:38+05:30 IST