కాడి పట్టిన మాజీ ఎంపీటీసీ

ABN , First Publish Date - 2022-10-12T04:20:19+05:30 IST

కాడెద్దులు లేక, ఇతరులను అడుగలేక పొలాన్ని దున్నేందుకు కాడెద్దుగా మారాడు ఓ మాజీ ప్ర జాప్రతినిధి.

కాడి పట్టిన మాజీ ఎంపీటీసీ

- ఎద్దులు తీసుకునేందుకు అడ్డొస్తున్న పేదరికం 

- వర్షాధార పంటలే ఆధారమంటున్న రైతు

దామరగిద్ద, అక్టోబరు 11 : కాడెద్దులు లేక, ఇతరులను అడుగలేక పొలాన్ని దున్నేందుకు కాడెద్దుగా మారాడు ఓ మాజీ ప్ర జాప్రతినిధి.  మండలంలోని మ ద్దెల్‌బీడ్‌ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు గిర్యా మోళ్ల గోపాల్‌ దీనగాథ ఇది. నిరుపేద రైతు కుటుంబానికి చెందిన గోపాల్‌ 2014 సంవత్సరంలో ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. ప్రస్తుతం రైతు కూలీగా మారాడు. గోపాల్‌కు ఐదెకరాల 20 గుంటల భూమి ఉంది. ఎలాంటి బోరుబావి లేదు. ఈయేడు మూడెకరాల్లో కంది సాగు చేయగా, మరో రెండెకరాల్లో పత్తి పంటను సాగు చేశాడు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వేసిన కంది పంట పాడై పోయింది. మిగిలిన భూమిలో వర్షాధారంపై ఆధారపడి కూరగాయలు పండిస్తున్నాడు. మరిన్ని కూరగాయాలు సాగు చేసేందుకు గాను అతని వద్ద కాడెద్దులు లేక పోవడం, ఇతరులను అడుగలేక తన పిల్లల సహకారంతో కాడెద్దుగా మారి దుక్కిదు న్నుతున్నాడు. పొలాన్ని ట్రాక్టర్ల సహాయంతో సాగు చేసుకుంటానని, తోటకు అవసరమైన కొద్దిపాటి భూమిని అత్యవసర సమయంలో ఈవిధంగా దున్నుకుంటానని చెప్పుకొచ్చాడు. కాడెద్దులు కొందామంటే పేదరికం అడ్డొస్తుం దని, అప్పు చేసి కొందామన్నా ఎద్దులను కాసేవారు లేరని, ఇతరత్రా కూలీ పనులు చేసుకుంటే తప్పా జీవనం గడువదన్నారు. తనకు ఆరేళ్ల పాప, నాలుగేళ్ల బాబు ఉన్నాడని, ఎంఏ, బీఈడీ చదువుకున్నానని, ప్రభు త్వం ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో వ్యవసాయ భూమిని నమ్ముకొని పొలం పనులు చేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నానని చెప్పాడు. ప్రభుత్వం ఇలాంటి పేద రైతులకు చేయూతనిచ్చి ఆదుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.  

Updated Date - 2022-10-12T04:20:19+05:30 IST