ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడినందుకు రూ.లక్షా 9 వేలు హాంఫట్‌

ABN , First Publish Date - 2022-11-07T23:24:48+05:30 IST

బాలుడు ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడటంతో బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్షా 9 వేల రూపాయలు కట్‌ అయ్యాయి.

ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడినందుకు రూ.లక్షా 9 వేలు హాంఫట్‌

కొల్లాపూర్‌ రూరల్‌, నవంబరు 7: బాలుడు ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడటంతో బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్షా 9 వేల రూపాయలు కట్‌ అయ్యాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మేస్త్రీ రమేష్‌ ఫోన్‌లో అతని కుమారుడు ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేవాడు. రమేష్‌ కుటుంబ అవసరాల నిమిత్తం డబ్బులను డ్రా చేసేందుకు సోమవారం కొల్లాపూర్‌ పటణంలోని బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు అధికారులు ఖాతాలో డబ్బులు లేవని చెప్పడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. బ్యాంకు వారు బాధితుడి స్టేట్‌మెంట్‌ను పరిశీలించగా, అక్టోబరు 12 నుంచి నవంబరు 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌ గేమ్‌లను ఆడుకునేందుకు ఫోన్‌పే, గూగుల్‌పే నుంచి అమౌంట్‌ కట్‌ అయినట్లు గుర్తించారు. తన కుమారుడిని ప్రశ్నించగా, గేమ్‌లను మాత్రమే ఆడినట్లు చెప్పాడని తెలిపాడు. కష్టపడి సంపాదించిన సొమ్ము స్మార్ట్‌ ఫోన్‌ పుణ్యమా అని పోవడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు.

Updated Date - 2022-11-07T23:24:48+05:30 IST

Read more