క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

ABN , First Publish Date - 2022-09-20T05:12:32+05:30 IST

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని సైక్లింగ్‌ క్రీడల జిల్లా అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గో పాలం అన్నారు.

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

 మక్తల్‌, సెస్టెంబరు 19:  క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని సైక్లింగ్‌ క్రీడల జిల్లా అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గో పాలం అన్నారు. సోమవారం మక్తల్‌ పట్టణం లోని పెద్ద చెరువు మినీ ట్యాంక్‌ బండ్‌ నుంచి మంథన్‌గోడ్‌ వరకు 10కిలోమీటర్ల మేర సైక్లింగ్‌ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే సమాజంలో గౌ రవంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, శారీరక ధృడత్వంతోపాటు స్పోర్ట్స్‌ కోటా కింద రెండు శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుం దన్నారు.  క్రీడల్లో రాణించిన వారు సులువుగా ఉద్యోగాలు సాధించొచ్చన్నారు. మక్తల్‌ పెద్ద చె రువు నుంచి మంథన్‌గోడ్‌ వరకు అండర్‌    14, 16,18  విభాగంలో విద్యార్థులు , అండర్‌- 23 విభాగంలో మహిళలు, పురుషులకు  వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. పోటీల్లో దా దాపు 100మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన క్రీడాకారు లను ఈనెల 24, 25తేదీల్లో కరీంనగర్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీల కు పంపిస్తామన్నారు. విజేతలకు నగదు బహుమతితో పాటు మెడల్స్‌ అందించారు. కార్యక్రమంలో నిర్వాహణ కార్యదర్శులు విష్ణువర్ధన్‌రెడ్డి, దామోదర్‌, ప్రకాష్‌రెడ్డి, మాస్టర్‌ అథ్లెటిక్స్‌ అధ్యక్షుడు సత్య ఆంజనేయులు, గౌరవ అధ్యక్షుడు  థాన్‌సింగ్‌, పీఈటీలు రమేష్‌ కుమార్‌, చిట్యాల రాజు, విద్యాసాగర్‌, క్రిష్ణ, ఉదయ్‌సాగర్‌, సాయిరాం, బీజేపీ నాయకులు బాల్చెడ్‌ మల్లికార్జున్‌, బాయికాటి రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-20T05:12:32+05:30 IST