ఆయిల్‌పాం సాగుతో ఉజ్వల భవిష్యత్తు

ABN , First Publish Date - 2022-07-06T04:48:17+05:30 IST

ఆయిల్‌ పాం సాగుతో రైతుకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు.

ఆయిల్‌పాం సాగుతో ఉజ్వల భవిష్యత్తు
పెద్దముద్దునూరులో ఆయిల్‌పాం మొక్కను నాటిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

 - నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూలై 5: ఆయిల్‌ పాం సాగుతో రైతుకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని  ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళ వారం మండల పరిధిలోని పెద్దముద్దునూరు లో రైతు శ్రీశైలం వ్యవసాయ పొలంలో ఎమ్మె ల్యే  ఆయిల్‌ పాం మొక్కను నాటారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్‌ పాం సాగు రైతుల పాలిట కల్పవృక్షమని, రైతు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. రైతునే రాజుగా మార్చా లనే సంకల్పంతో సాగునీటి ప్రాజెక్టులు, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను  సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో జి ల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్‌, జడ్పీటీసీ సభ్యుడు శ్రీశైలం, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్లు వెంకటయ్య, ఈశ్వరెడ్డి పాల్గొన్నారు.   

ఆయిల్‌ పాం సాగు చేయాలి  

కోడేరు, : ఆయిల్‌ పాం సాగు చేసి అధిక దిగుబడులు పొందాలని కొల్లాపూర్‌ ఎ మ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళ వారం మండల పరిధిలోని ఎత్తం గ్రామంలో రైతుల పొలాల్లో ఆయిల్‌ పాం మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 513ఎకరాలు ఆయిల్‌ పాం సాగు చేస్తున్నట్లు తెలిపారు.  దేశంలో ఏడాదికి 22మిలియన్‌ టన్నులు నూనె గిం జలను మాత్రమే సాగు చేస్తున్నారన్నారు. కానీ, 70వేల కోట్లు పామాయిల్‌ దిగుమతి చేసుకుం టామన్నారు. రాష్ట్రంలో ఆయిల్‌పాం తోటలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు.  కార్య క్రమంలో సంబంధిత శాఖ అధికారులు, మండల నాయకులు పాల్గొన్నారు.



Updated Date - 2022-07-06T04:48:17+05:30 IST