‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి: డీఈవో

ABN , First Publish Date - 2022-12-30T23:24:12+05:30 IST

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సా ధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు అన్నారు.

‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి: డీఈవో
మాగనూరు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న డీఈవో

కృష్ణ, డిసెంబరు 30: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సా ధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఎఫ్‌ఎల్‌ఎన్‌ పర్యవేక్షణలో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. గణితంలో పలు ప్రశ్నలు వేయగా విద్యార్థులు జవాబు చెప్పలేకపోవడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు ఏమి పాఠాలు బోధించా రని ప్రశ్నించారు. ఏఏ సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనుకబడినారో గుర్తించి పాఠాలు బో ధించాలన్నారు. వంద శాతం ఉత్తీర్ణత తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు తదితరులున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

మాగనూరు: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని డీఈవో గోవిందరాజులు ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలను డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంట ఏజెన్సీలు వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అలాగే ‘మన ఊరు - మన బడి’ కింద నిర్మాణం జరుగుతున్న పనులను పరిశీలించారు. పాఠశాలలో పై కప్పు పెచ్చులు ఊడిపడుతున్న విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివరాజ్‌ డీఈవోకు దృష్టికి తీసుకొచ్చారు. పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. ఉన్నత పాఠశాలలో కూడా రికార్డులను పరిశీలించి 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. అదేవిధంగా కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సిములు, ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యాయులు శివరాజప్ప, కేజీబీవీ ఎస్‌వో రాధిక, ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - 2022-12-30T23:24:14+05:30 IST