నవంబరు 23న విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా
ABN , First Publish Date - 2022-09-19T07:55:17+05:30 IST
విద్యుత్తు సవరణ బిల్లు-2022ను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో నవంబరు 23న నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని, దేశవ్యాప్త సమ్మెకు విద్యుత్తు కార్మికులు సిద్ధంగా ఉండాలని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్(ఏఐపీఈఎఫ్) పిలుపునిచ్చింది.

హైదరాబాద్, సెప్టెంబరు 18: విద్యుత్తు సవరణ బిల్లు-2022ను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో నవంబరు 23న నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని, దేశవ్యాప్త సమ్మెకు విద్యుత్తు కార్మికులు సిద్ధంగా ఉండాలని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్(ఏఐపీఈఎఫ్) పిలుపునిచ్చింది. ఆదివారం శ్రీనగర్‌లో నిర్వహించిన ఏఐపీఈఎఫ్ ఫెడరల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. సమావేశానికి తెలంగాణ నుంచి టీఎ్సపీఈఏ అధ్యక్షుడు రత్నాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి సదానందం హాజరయ్యారు.