మావోయిస్టులకు ఆశ్రయం కల్పించొద్దు : ఎస్పీ

ABN , First Publish Date - 2022-09-10T05:51:21+05:30 IST

మావోయిస్టులకు ఆశ్రయం కల్పించొద్దు : ఎస్పీ

మావోయిస్టులకు ఆశ్రయం కల్పించొద్దు : ఎస్పీ

గూడూరు రూరల్‌, సెప్టెంబరు 9 : మావోయిస్టులకు ఎలాంటి ఆశ్రయం, సహకారం అందించవద్దని జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గూడూరు మండలం మట్టెవాడ, ఊట్ల గ్రామాలను శుక్రవారం సా యంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మావోయిస్టులు అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆపై ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఒకప్పటి పాత పద్ధతిలాగా బెదిరించే పద్ధతి లేదని, ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీసులు పిలిస్తే పలికే విధంగా అందుబాటులో ఉన్నారన్నారు. ఏదైనా ఘటన జరిగితే డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే 5 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారని చెప్పారు. ఎక్కడైనా బెదిరించే ప్రయత్నం చేసినా ఉన్నతాధికారులకు తెలుస్తుంద న్నారు. ప్రజ లు పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకు ండా చూసుకునే బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ సదయ్య, గూడూరు సీఐ యాసిన్‌, ఎస్సై సతీష్‌, కొత్తగూడ, గంగారం ఎస్సైలు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-09-10T05:51:21+05:30 IST