జాతీయ స్థాయి పంచాయతీ అవార్డులు సాధించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-09-10T05:49:52+05:30 IST

జాతీయ స్థాయి పంచాయతీ అవార్డులు సాధించాలి : కలెక్టర్‌

జాతీయ స్థాయి పంచాయతీ అవార్డులు సాధించాలి : కలెక్టర్‌

 మహబూబాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్ర జ్యోతి) : జాతీయ స్థాయి పంచాయతీ అవా ర్డుల్లో మానుకోట జిల్లాకు అత్యధిక అవార్డులు వచ్చే విధంగా కృషి చేయాలని కలెక్టర్‌ శశాంక అన్నారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవా రం నోడల్‌ అధికారులకు  నిర్వహించిన శిక్షణ  ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు సుస్థిర అభివృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం సూ చించిన తొమ్మిది లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించి ఎక్కువ అవార్డులు పొందా లన్నారు. ప్రధానంగా ఇప్పటికే మొదటి మూడు, ఐదో స్థానంలో ఉన్న పంచా యతీలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.  అవార్డు పొందడం ద్వారా గుర్తింపుతో పాటు ప్రతిష్ట పెరుగుతుందన్నారు. తాను కూడ ఐదు గ్రామాలను దత్త్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌,  అధికారులు సాయిబాబా, రమాదేవి సన్యాసయ్య, కృష్ణారెడ్డి, డాక్టర్‌ అంబరీష పాల్గొన్నారు.

పరీక్ష నిర్వహణకు సిద్ధంగా ఉండాలి 

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ)పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని  కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో విద్యాశాఖాధికారులు, ప్రైవేట్‌ విద్యాసంస్థల బాధ్యులతో సమావేశాన్ని నిర్వహించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల నిర్వాహణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల నిర్వాహణకు గాను 31 కేంద్రాలను గుర్తిం చడం జరిగిందని, వీటిలో 11 ప్రభుత్వ విద్యాసంస్థలు, 20 ప్రైవేట్‌ విద్యాసం స్థలున్నాయని చెప్పారు. జిల్లాలో సుమారు 7806 మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. 

Updated Date - 2022-09-10T05:49:52+05:30 IST