Macherialలో వివాహిత అదృశ్యం

ABN , First Publish Date - 2022-05-30T14:21:58+05:30 IST

జిల్లాలోని హజీపూర్ మండలం ముల్కల్లకు చెందిన మౌనిక అనే వివాహిత అదృశ్యం కలకలం రేపుతోంది.

Macherialలో వివాహిత అదృశ్యం

మంచిర్యాల: జిల్లాలోని హజీపూర్ మండలం ముల్కల్లకు చెందిన మౌనిక అనే వివాహిత అదృశ్యం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళుతున్నట్టు చెప్పి వెళ్లిన మౌనిక తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మౌనిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2022-05-30T14:21:58+05:30 IST