ఆయుష్‌ డైరెక్టర్‌గా ఎం.ప్రశాంతి

ABN , First Publish Date - 2022-07-05T10:14:29+05:30 IST

ఆయుష్‌ డైరెక్టర్‌గా ఉన్న అలుగు వర్షిణి ఉన్నత చదువుల కోసం స్టడీ లీవ్‌లపై వెళ్లనున్నారు.

ఆయుష్‌ డైరెక్టర్‌గా ఎం.ప్రశాంతి

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఆయుష్‌ డైరెక్టర్‌గా ఉన్న అలుగు వర్షిణి ఉన్నత చదువుల కోసం స్టడీ లీవ్‌లపై వెళ్లనున్నారు. దీంతో ఆమె స్థానంలో ఎన్విరాన్‌మెంట్‌, ఫారెస్ట్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అడిషనల్‌ సెక్రటరీగా ఉన్న ఎం.ప్రశాంతికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ప్రశాంతి ఆయుష్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కాగా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌గా శ్వేత మహంతికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం శ్వేత మహంతి హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌గా ఉన్నారు.

Read more