‘జహీరాబాద్‌’లో ఆవులకు లంపీస్కిన్‌ వైరస్‌

ABN , First Publish Date - 2022-10-12T10:02:27+05:30 IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని కోహీర్‌, మొగుడంపల్లి మండలాల్లో ఆవులకు ప్రాణాంతక వైరస్‌ సోకుతోంది.

‘జహీరాబాద్‌’లో ఆవులకు లంపీస్కిన్‌ వైరస్‌

జహీరాబాద్‌, అక్టోబరు 11: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని కోహీర్‌, మొగుడంపల్లి మండలాల్లో ఆవులకు ప్రాణాంతక వైరస్‌ సోకుతోంది. లంపీస్కిన్‌ వైర్‌సగా పేర్కొంటున్న ఈ వ్యాధి బారిన పడిన ఆవులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాయి. కోహిర్‌ మండలం పిచేర్యగడి తండాలో 15 ఆవులకు పైగా ఈ వైరస్‌ సోకినట్లు మండల పశు వైద్యాధికారి జిన్నత్‌భాను తెలిపారు. ఇదే తండాలో ఆదివారం రాత్రి ఒక అవు మృతి చెందినట్లు తండావాసులు పేర్కొన్నారు. అలాగే మొగుడంపల్లి మండలంలోని మన్నాపూర్‌, మొగుడంపల్లి, చిన్నబట్టి తండా, లేత మామిడి తండా, ఉప్పరపల్లి తండాలోని ఆవులకు ఈ వైరస్‌ సోకినట్లు మండల పశువైద్యాధికారి నాగార్జున తెలిపారు.  

Read more