ఎల్లంపల్లి ప్రాజెక్టు 43 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-07-13T12:41:42+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద పోటెత్తడంతో ప్రాజెక్టులు నిండుకుండలామారుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి

ఎల్లంపల్లి ప్రాజెక్టు 43 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద పోటెత్తడంతో ప్రాజెక్టులు నిండుకుండలామారుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు(Ellampalli project)లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు 43 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ఇన్‌ఫ్లో 8.50 లక్షలుగా ఉండగా, ఔట్‌ఫ్లో 8.50 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 14.7168 టీఎంసీలుగా కొనసాగుతుంది.

Read more