కవాల్‌ టైగర్‌ రిజర్వ్‌ వెబ్‌సైట్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-31T09:30:37+05:30 IST

కవాల్‌ టైగర్‌ రిజర్వ్‌ గురించి పర్యాటకులు, సందర్శకులకు మరింత సమాచారం ఇచ్చేందుకు అటవీశాఖ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది.

కవాల్‌ టైగర్‌ రిజర్వ్‌ వెబ్‌సైట్‌ ప్రారంభం

హైదరాబాద్‌, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): కవాల్‌ టైగర్‌ రిజర్వ్‌ గురించి పర్యాటకులు, సందర్శకులకు మరింత సమాచారం ఇచ్చేందుకు అటవీశాఖ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది. కవాల్‌ పులుల అభయారణ్యంపై అన్ని వివరాలతో రూపొందించిన ఠీఠీఠీ.జ్చుఠీ ్చజ్టూజీజ్ఛట.ఛిౌఝ  అనే వెబ్‌సైట్‌ను రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌ వల్ల టైగర్‌ రిజర్వ్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.  

Read more