పరిహారం ఇవ్వకుంటే నిరసన

ABN , First Publish Date - 2022-07-06T05:22:30+05:30 IST

పరిహారం ఇవ్వకుంటే నిరసన

పరిహారం ఇవ్వకుంటే నిరసన

నిరవధికంగా బొగ్గు ఉత్పత్తిని అడ్డుకుంటాం 

సింగరేణి అధికారులకు భూనిర్వాసితుల అల్టిమేటం

కాకతీయఖని, జూలై 5: తమకు రావాల్సిన పరిహారం చెల్లించకుంటే భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్‌కాస్టు-2, కేటీకే ఒకటో గని బొగ్గు ఉత్పత్తిని అడ్డుకుంటామని భూనిర్వాసి తులు హెచ్చరించారు. ఈ మేరకు సింగరేణి జనరల్‌ మేనేజర్‌ సుబ్బారావుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమకు పరిహారం అందించడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్నిసా ర్లు వినతులు సమర్పించినా పెడచెవిన పెడుతున్నారన్నారు. న్యాయం చేస్తామ ని హామీ ఇస్తున్నారే తప్ప స్పందించిన దాఖలాలు లేవన్నారు. దీంతో తాము దశల వారీ ఆందోళనలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఈనెల 20లోగా పరిహారం చెల్లించకుంటే 22 నుంచి నిరవధిక నిరసనలు చేపట్టి బొగ్గు ఉత్పత్తిని అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. జీఎంను కలిసిన వారిలో  బుర్ర రమేష్‌, రాజయ్య, మహేందర్‌, శ్రీనివాస్‌, రాజు తదితరులు ఉన్నారు.  

Read more