Komatireddy Venkatareddy: కేటీఆర్.. ఆ 10వేల కోట్ల కుంభకోణంపై నేను మాట్లాడానా?

ABN , First Publish Date - 2022-10-11T23:15:58+05:30 IST

Hyderabad: కోమ‌టిరెడ్డి సోదరులను మంత్రి కేటీఆర్ ‘‘కోవర్ట్ బ్ర‌ద‌ర్స్’’ అని అనడంపై కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఫైరయ్యారు. తెలంగాణ భ‌వ‌న్‌లో జరిగిన టీఆర్ఎస్‌వీ విస్తృత స్థాయి స‌మావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వారు గుర్రుగా ఉన్నారు. తీవ్ర ఆగ్రహంతో కేటీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

Komatireddy Venkatareddy: కేటీఆర్.. ఆ 10వేల కోట్ల కుంభకోణంపై నేను మాట్లాడానా?

Hyderabad: కోమ‌టిరెడ్డి సోదరులను మంత్రి కేటీఆర్ ‘‘కోవర్ట్ బ్ర‌ద‌ర్స్’’ అని అనడంపై ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఫైరయ్యారు. తెలంగాణ భ‌వ‌న్‌లో జరిగిన టీఆర్ఎస్‌వీ విస్తృత స్థాయి స‌మావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై  ఆయన గుర్రుగా ఉన్నారు. తీవ్ర ఆగ్రహంతో కేటీఆర్‌పై  వెంకటరెడ్డి పలు ప్రశ్నలను సంధించారు.


‘‘తెలంగాణ కోసం మంత్రి పదవి వదులుకున్న నన్ను.. కోవర్ట్ అనే అర్హత కేటీఆర్‌కు ఉందా? కల్వకుంట్ల కుటుంబం అంటేనే కమీషన్ల కుటుంబం. సొంత పార్టీ నేతలు తిట్టిన బాధలో నేను ప్రచారానికి వెళ్లడం లేదు. నేను ప్రచారానికి వెళ్లకపోతే నీకేంటి? విదేశాలకు వెళ్తే నీకేంటి? కేటీఆర్ నువ్వు విదేశాలకు వెళ్లి ఏం చేశావో నాకు తెలుసు. నువ్వెందుకు విదేశాలకు వెళ్లావని నేను అడిగానా? తడిచర్లలో రూ. 10వేల కోట్ల కుంభకోణంపై నేను మాట్లాడానా? సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి.. మునుగోడులో ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు.

Updated Date - 2022-10-11T23:15:58+05:30 IST