111 బదులు కొత్త జీవో

ABN , First Publish Date - 2022-03-16T09:14:22+05:30 IST

ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న ఓ హ్యాండ్‌బాల్‌ ప్లేయర్‌తోపాటు ఓ ఐఐటీ విద్యార్థికి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు.

111 బదులు కొత్త జీవో

విద్యార్థి, క్రీడాకారిణికి కేటీఆర్‌ ఆర్థిక సాయం

హైదరాబాద్‌, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న ఓ హ్యాండ్‌బాల్‌ ప్లేయర్‌తోపాటు ఓ ఐఐటీ విద్యార్థికి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు. కుమ్రంభీం-ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన హ్యాండ్‌బాల్‌ ప్లేయర్‌ మడావి కరీనా.. గిరిజన సంక్షేమ పాఠశాలలో చదువుకుంది. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌ల్లో సత్తాచాటి ఈనెల 18 నుంచి కజకిస్తాన్‌లో జరిగే ఆసియా యూత్‌ ఉమెన్‌ హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షి్‌పకు ఎంపికైంది. కేటీఆర్‌ ఆమెకు అవసరమైన సాయాన్ని అందజేశారు. హైదరాబాద్‌ అంబర్‌పేటలోని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన మణిదీప్‌ జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షల్లో సత్తాచాటి ఐఐటీ గౌహతిలో సీటు సాధించాడు. ఫీజులు, ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్‌.. మణిదీ్‌పకు అవసరమైన ఆర్థిక సాయం చేయడంతోపాటు ఓ ల్యాప్‌టాప్‌ కూడా అందజేశారు. 

Read more